కరోనాతో పోల్చితే బిన్ లాడెన్ ఓ బచ్చా: ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశంపై అయినా సరే తనదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పించడంలో ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మమమ్మారిపై వరుస ట్వీట్స్ చేస్తూ.. కాస్త మంచిగానే ఉన్నాడు. మరోవైపు కరోనా పోరులో భాగంగా తన వంతుగా జనాల్లో చైతన్యం కలిపిస్తున్నాడు కూడా. అయితే.. అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం కరోనాతో గంటకు సుమారు 100 మంది దాకా మరణిస్తున్నారు. ఈ తరుణంలో ఆర్జీవీ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.
అదేమిటంటే.. ‘అమెరికాలో సంభవిస్తున్న మరణాలు చూస్తుంటే అక్కడ ప్రతిరోజూ 9/11 దాడులు జరుగుతున్నట్టుగా ఉంది. కరోనా మహమ్మారితో పోల్చితే ఒసామా బిన్ లాడెన్ ఓ బచ్చా . అయినా.. ఒసామా బిన్ లాడెన్ ఆత్మ పగబట్టి కరోనా వైరస్ రూపంలో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటోందని నేను భావించడంలేదు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటివరకు 6.44 లక్షల మందికి కరోనా సోకగా, 28 వేల మందికి పైగా మరణించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments