ట్రంప్ పర్యటన: అలా జరగదనే ఆశిస్తున్నా: ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూటే సపరేటు.. నేనింతే.. అంటూ ప్రవర్తిస్తుంటారు. ఎవర్నీ వదిలేది అంటూ సామాన్యుడి నుంచి సెలబ్రిటీ ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే సమయం, సందర్భాన్ని బట్టి సోషల్ మీడియాలో హడావుడి చేసే ఆర్జీవీ.. అగ్రరాజ్యం అధినేత డోనాల్ ట్రంప్ భారత్ పర్యటనపై వరుస ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘ట్రంప్ పర్యటనకు కోటి మంది జనం’ అనేదానిపై నానా హడావుడి చేసిన ఆయన.. ట్రంప్ మొదటి రోజు పర్యటన అనంతరం మరోసారి ట్వీట్ చేయడంతో నెట్టింట్లో ఆయన హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏమన్నారు..? ఆయన ట్వీట్‌కు నెటిజన్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
అలా జరగదనే ఆశిస్తున్నా!
‘ట్రంప్‌కు జనాల్ని చూస్తే ఊపొస్తుందన్న విషయం తెలుసుకుని ప్రధాని నరేంద్ర మోదీ.. కోటి మంది ప్రజలు వస్తారని ఆయన్ని మభ్యపెట్టడం బాగుంది.. కానీ వచ్చింది కోటి మంది కాదు లక్ష మందే. అసలే ట్రంప్‌లో ప్రతీకార ధోరణి ఎక్కువ. ఆయన నిర్వహించే సభకు జనాలు రాలేదని అలిగి భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు క్యాన్సిల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.. అయితే అలా జరగదనే నేను ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
అంతటితో ఆగని ఆయన.. ‘ట్రంప్ ఆ స్టేడియంలో జనాల్ని లెక్కించలేక.. ఆ లక్ష మందినే కోటి మంది అని భావిస్తే భారత్ పంట పండినట్టే’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాబోయ్.. మీ ట్వీట్ల కీర్తి దేశాలు.. ప్రపంచాలు దాటుపోతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
I luv it that our PM played on @realDonaldTrump ‘s obsession for crowds and lured him by saying 1 crore will come ..But now since instead of 1 crore only 1 lak came ,I hope Donnie baby won’t sulk and cancel the trade deal with india ..Trump is known to be revengeful ??
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com