ట్రంప్ పర్యటన: అలా జరగదనే ఆశిస్తున్నా: ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూటే సపరేటు.. నేనింతే.. అంటూ ప్రవర్తిస్తుంటారు. ఎవర్నీ వదిలేది అంటూ సామాన్యుడి నుంచి సెలబ్రిటీ ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే సమయం, సందర్భాన్ని బట్టి సోషల్ మీడియాలో హడావుడి చేసే ఆర్జీవీ.. అగ్రరాజ్యం అధినేత డోనాల్ ట్రంప్ భారత్ పర్యటనపై వరుస ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘ట్రంప్ పర్యటనకు కోటి మంది జనం’ అనేదానిపై నానా హడావుడి చేసిన ఆయన.. ట్రంప్ మొదటి రోజు పర్యటన అనంతరం మరోసారి ట్వీట్ చేయడంతో నెట్టింట్లో ఆయన హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏమన్నారు..? ఆయన ట్వీట్‌కు నెటిజన్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

అలా జరగదనే ఆశిస్తున్నా!

‘ట్రంప్‌కు జనాల్ని చూస్తే ఊపొస్తుందన్న విషయం తెలుసుకుని ప్రధాని నరేంద్ర మోదీ.. కోటి మంది ప్రజలు వస్తారని ఆయన్ని మభ్యపెట్టడం బాగుంది.. కానీ వచ్చింది కోటి మంది కాదు లక్ష మందే. అసలే ట్రంప్‌లో ప్రతీకార ధోరణి ఎక్కువ. ఆయన నిర్వహించే సభకు జనాలు రాలేదని అలిగి భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు క్యాన్సిల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.. అయితే అలా జరగదనే నేను ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

అంతటితో ఆగని ఆయన.. ‘ట్రంప్ ఆ స్టేడియంలో జనాల్ని లెక్కించలేక.. ఆ లక్ష మందినే కోటి మంది అని భావిస్తే భారత్ పంట పండినట్టే’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాబోయ్.. మీ ట్వీట్ల కీర్తి దేశాలు.. ప్రపంచాలు దాటుపోతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More News

ఈ ఉగాది కి zee5 తమ ప్రేక్షకులందరికీ షడ్రుచుల అమృతాన్ని ఒడ్డించబోతుంది ‘అమృతం ద్వితీయం’

భారత దేశపు అతి పెద్ద   కాంటెక్ టెక్నాలజీ బ్రాండ్ అయిన zee5 నెటవర్క్ ప్రేక్షకులకి ఎల్లప్పుడూ ఉన్నత కంటెంట్ ను అందించడంలో ముందంజలో ఉంటుంది.

ట్రంప్ ‘పసుపు టై’.. మెలానియా ‘వస్త్రం’ స్పెషాలిటీ ఇదీ..

అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఇండియాకు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ట్రంప్ కట్టుకున్న ‘పసుపు టై’,

నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'

నాచురల్ స్టార్ 'నాని' హీరోగా 'జెర్సీ' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన ఉత్తమ కధా చిత్ర్రాన్ని నిర్మించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ

నితిన్ భీష్మ స‌క్సెస్‌... పెళ్లిపై బ‌న్నీ కామెంట్స్‌

ఇద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. బిడ్డొచ్చిన వేళ‌.. గొడ్డొచ్చిన వేళ అనే సామెత వినే ఉంటాం .. అలా ఇప్పుడు నితిన్ ప‌రిస్థితి త‌యారైంది.

వ‌రుణ్ తేజ్ షూటింగ్ షురూ చేశాడుగా!

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌.