'ఫ్యామిలీ మ్యాన్ 2'పై ఆర్జీవీ రివ్యూ.. అంత నచ్చిందా!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ఆయన పాజిటివ్ గా మాట్లాడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎంతో నచ్చితే కానీ ఒక అంశంపై వర్మ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వరు. తాజాగా వర్మ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: రవితేజ, త్రినాధరావు మూవీ ఆగిపోలేదు.. ఇదిగో క్లారిటీ!

'ఫ్యామిలీ మ్యాన్ 2 రియలిస్టిగ్ గా తెరకెక్కించబడ్డ జేమ్స్ బాండ్ తరహా కథ. ఫ్యామిలీ మ్యాన్ ప్రాంచైజీ మరింత కాలం దూసుకుపోతూనే ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, వినోదం కలగలిపి నటించడం చాలా కష్టం. అది కేవలం మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటులకు మాత్రమే సాధ్యం. ఆయన డ్రామాని, సహజత్వాన్ని చాలా చక్కగా క్యారీ చేశారు' అని వర్మ ప్రశంసల జల్లులు కురిపించాడు.

మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. దర్శకులు రాజ్ అండ్ డీకే.. నటులు మనోజ్ బాజ్ పాయ్, సమంతకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 1 పాకిస్థాన్ నేపథ్యంలో తెరకెక్కగా ఫ్యామిలీ మ్యాన్ 2 శ్రీలంక తమిళ రెబల్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఫ్యామిలీ మ్యాన్ 3 కోసం దర్శకులు రాజ్ అండ్ డీకే చైనా బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు.