సుమంత్ పెళ్లిని కెలుకుతూ ఆర్జీవీ దారుణంగా.. కారణం అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ సమయంలో అయినా, ఎలాంటి వారిపై అయినా విమర్శలు చేస్తుంటాడు. కొన్ని సార్లు వ్యక్తిగత విమర్శలు చేయడంతో అవి తీవ్ర వివాదంగా మారుతుంటాయి. ఆర్జీవీ తెలివి ఏంటంటే వ్యక్తిగత విమర్శలు చేసే సమయంలో కొన్నిసార్లు పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా ట్రోల్ చేస్తాడు.
ఇదీ చదవండి: లడాఖ్ షూట్ లో నేను, నాగ చైతన్య ఎంజాయ్ చేసింది ఇలాగే: అమీర్ ఖాన్
కానీ తాజాగా వర్మ డైరెక్ట్ గా హీరో సుమంత్ వ్యక్తిగత విషయానికి సంబంధించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హీరో సుమంత్ రెండవ వివాహానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోబోతున్నాడు. సుమంత్ ఇదివరకే 2004లో కీర్తి రెడ్డిని వివాహం చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆర్జీవీ ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'ఒకసారి అయ్యాక కూడా ఇంకా బుద్ది రాలేదా సుమంత్ ? నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ.. అనుభవించండి.
ఒక పెళ్లే నూరేళ్ళ పెంట అయితే.. రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి ? నా మాట విని మానేయ్.. పరిత్ర గారు మీ జీవితాలని పాడు చేసుకోకండి. తప్పు మీది, సుమంత్ ది కాదు.. ఈ దౌర్భాగ్యపు వ్యవస్తది' అంటూ వర్మ కామెంట్స్ చేశాడు.
వర్మ సెలెబ్రిటీలపై సెటైర్లు వేయడం సాధారణ విషయమే. కానీ ఇలా సుమంత్ పర్సనల్ లైఫ్ పై అటాక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం లేకపోలేదు. నాగార్జున నుంచి అక్కినేని ఫ్యామిలీతో వర్మకు మంచి సాన్నిహిత్యం ఉంది. అక్కనేని ఫ్యామిలీ అందరితో వర్మ క్లోజ్ గా మూవ్ అవుతారు. ఆ చనువుతోనే వర్మ సుమంత్ పై లాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఉంది.
నాగ్ మేనల్లుడిగా సుమంత్ టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ఏఎన్నార్ కుమర్తె సత్యవతి కుమారుడే సుమంత్. సుమంత్ తన నటనతో మంచి గుర్తింపు పొందాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments