ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ను కెలుకుతున్న వ‌ర్మ‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను, అత‌ని అభిమానుల‌ను వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌కు ప‌బ్లిసిటీ కావాల్సిన‌ప్పుడల్లా కెలుకుతుంటాడు. వ‌ర్మ విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేరుగా స్పందించ‌డు కానీ.. ఆయ‌న అభిమానులు స్పందిస్తుంటారు. అలా వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్‌ను యూనిక్ పీస్ అంటూ పొగిడాడు. అలా అని రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే ప‌వ‌న్ అభిమానుల‌తో సున్నం పెట్టుకునే ప‌నిని స్టార్ట్ చేశాడు.

ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ కోసం వ‌రుస సినిమాలు చేస్తున్న వ‌ర్మ త‌దుప‌రి తాను ‘ప‌వ‌ర్‌స్టార్ ’ అనే సినిమాను చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంతే కాకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను పోలిన‌ట్లు ఉండే న‌టుడి లుక్ వీడియో విడుద‌ల చేశాడు వ‌ర్మ‌. అత్తారింటికి దారేది చిత్రంలో ప‌వ‌న్ లుక్‌ను పోలిన‌ట్లు డ్రెస్సింగ్ ఉన్న‌ న‌టుడు వీడియోలో క‌న‌ప‌డ్డాడు. స‌ద‌రు న‌టుడు త‌న‌ను క‌ల‌వ‌డానికి ఆఫీసుకి వ‌చ్చిన‌ప్పుడు తాను షూట్ చేశాన‌ని వ‌ర్మ చెప్ప‌డం గ‌మ‌నార్హం. త‌న సినిమాలో పీకే, ఎంఎస్‌. ఎన్‌బీ, టీఎస్‌, 4 పిల్ల‌లున్న ర‌ష్య‌న్ లేడీ, ఆర్జీవీ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నార‌ని ప్ర‌క‌టించారు వ‌ర్మ‌. మ‌రి భ‌విష్య‌త్తులో వ‌ప‌ర్‌స్టార్ అంటూ వ‌ర్మఎలాంటి ర‌చ్చ చ‌స్తాడో చూడాలి.

లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌రుస సినిమాలు చేసి ఆర్జీవీ వ‌రల్డ్ థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌డం ప్రారంభించాడు వ‌ర్మ‌. క్లైమాక్స్‌, క‌రోనా వైర‌స్ సినిమాలు చేసిన వ‌ర్మ ఈ రెండు సినిమాల‌కు ఫ‌ర్ వ్యూకు వంద రూపాయ‌లు వ‌సూలు చేశాడు. శ‌నివారం న‌గ్నం అనే మ‌రో సినిమాను విడుద‌ల చేసిన వ‌ర్మ ఫ‌ర్ వ్యూకు రూ.200 వ‌సూలు చేశాడు.

More News

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలకు బ్రేకేసిన కరోనా

ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయమై గతంలో చర్చలు నడిచాయి.

ప్రమాదం అంచున డయాబెటిస్ రోగులు..

ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే కరోనా నుంచి బయటపడటం చాలా కష్టమని వైద్యులు వెల్లడిస్తూనే ఉన్నారు.

కరోనా లిస్టులో కొత్తగా మరో మూడు లక్షణాలు

కరోనా కేసులతో పాటు లక్షణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా లక్షణాల లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరో మూడు లక్షణాలను చేర్చింది.

వసుధ ఫౌండేషన్ సౌజన్యంతో 'మనం సైతం' భారీ వితరణ!!

'ఆపన్నుల పాలిట అభయ హస్తం'గా మారిన కాదంబరి సారధ్యంలోని 'మనం సైతం'

ఏపీలో నేడు 800 దాటిన కరోనా కేసులు

ఏపీలో నేడు కరోనా పాజిటివ్ కేసులు 800 దాటాయి. గడిచిన 24 గంటల్లో 25వేల 778 నమూనాలను పరిశీలించగా..