చిరు, పవన్ కలయిక పై వర్మ కామెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
అన్నయ్య చిరంజీవి ని తమ్ముడు పవన్ కళ్యాణ్ కలసి చాలా రోజులు తర్వాత బ్రూస్ లీ సినిమాలో నటించినందుకు అభినందించిన విషయం తెలిసిందే. అన్నయ్య 60వ పుట్టినరోజు వేడుకను అభిమానుల సమక్షంలో గ్రాండ్ చేస్తే...వెళ్లని పవన్... ఇప్పుడు ఏకంగా సర్ధార్ షూటింగ్ నుంచే డ్రెస్ కూడా మార్చకుండా చిరు ఇంటికి వెళ్లడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇదే విషయం గురించి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో...నయాగరా ఫాల్స్ తర్వాత నేను చూసిన గొప్ప విజువల్ ఇదే అంటూ చిరు, పవన్, చరణ్ కలసి ఉన్న ఫోటో పోస్ట్ చేసాడు. అలాగే చిరు, పవన్ కలవడం కలే అనుకున్నాను. కానీ నిజంగా కలవడం చూసి ఆనందించాను. ఈ ఆనందంలో బ్రూస్ లీ సినిమాను మళ్లీ చూస్తాను అంటూ స్పందించాడు. మరి..వర్మ మాటల్లో మర్మమేమిటో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments