కంగ‌నా సీఎం అయ్యేలా ఉంది: వ‌ర్మ‌

  • IndiaGlitz, [Wednesday,September 09 2020]

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ న‌టి కంగ‌నా ర‌నౌత్‌ను ఉద్దేశించి పెద్ద ట్వీటే చేశాడు. సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి త‌ర్వాత బాలీవుడ్‌లో ఎన్నో ర‌కాల ప‌రిణామాలు జ‌రిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ నెపోటిజంపై పోరాటం చేస్తుంది. ఓ ర‌కంగా చెప్పాలంటే కంగనా చేసిన గొడ‌వ‌తో కేంద్ర ప్ర‌భుత్వం కేసును సీబీఐకి అప్ప‌గించింది. ఇప్పుడు డ్ర‌గ్స్ మాఫియా వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. మ‌రో వైపు కంగ‌నా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిర‌రేకంగా కూడా మాట్లాడింది. అలా మాట్లాడిందో లేదో కంగనా ఆఫీస్ అక్ర‌మ క‌ట్ట‌డం అంటూ బీఎంసీ అధికారులు కూల్చేశారు. అయితే కూల్చివేత‌పై కంగనా ముంబై హైకోర్టును ఆశ్ర‌యించింది. కూల్చివేత‌ల‌ను నిలిపి వేయాల‌ని, దీనిపై అధికారులు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర్టు అధికారుల‌ను ఆదేశించింది. అయితే అప్ప‌టికే దాదాపు క‌ట్ట‌డాన్ని అధికారులు కూల్చేశారు. రేపు కోర్టులో అధికారులు వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.

ప‌లువురు ప్ర‌ముఖులు కంగ‌నా వ్య‌వ‌హారంపై ముంబై ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రిగ్గా లేదంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ‘‘జరిగే పరిణామాలను చూస్తుంటే.. భవిష్యత్తులో మహారాష్ట్ర సీఎంగా అయ్యే అవ‌కాశాలు కంగ‌నాకు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, ఒక‌వేళ ఆమె నిజంగానే మ‌హారాష్ట్ర సీఎం అయితే బాలీవుడ్ ప్ర‌ముఖులంద‌రూ టింబెక్టు ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందే’’ అని తెలిపారు వ‌ర్మ‌.

More News

నా డెస్టెనీ వేరేలా ఉందని అప్పుడు తెలిసింది: రేణు దేశాయ్

1995లో ఇదే రోజున తాను కెమెరాను ఫేస్ చేశానని ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ వెల్లడించారు.

'బొమ్మ బ్లాక్ బస్టర్' చిత్రం నుండి రష్మీ ఫస్ట్ లుక్

యంగ్ టాలెంటెడ్ హీరో నందు, డ‌స్కీ బ్యూటీ ర‌ష్మీ గౌత‌మ్ జంట‌గా విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై

నిలిచిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు..

ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ఫేజ్ 3 ట్రయల్స్ అర్థంతరంగా ఆగిపోయాయి.

కీసర తహసీల్దార్‌ను మించిన అవినీతి తిమింగళం దొరికింది..

25 రోజుల తేడాతోనే రెండు భారీ అవినీతి తిమింగళాలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి.

క్లారిటీ లేని టాస్క్‌లతో బోర్ కొట్టించిన బిగ్‌బాస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో షో స్టార్ట్ అవడంతో... ఇంకేముంది ఇవాళ బిగ్‌బాస్ ఫుల్లు ఎంటర్‌టైనింగ్‌‌గా ఉండొచ్చు అనిపించింది.