గ్రేటర్‌కి కాదు.. అంతర్జాతీయ కుక్కల మేయర్‌ను చేయాల్సింది: ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీటారంటే.. దాదాపు ఎవరికో పంచ్ పడిందనే డిసైడ్ అవ్వాల్సిందే. ఏవైనా ఆసక్తికర వీడియోలు చూసినా.. ఫోటోలు చూసినా వాటిపై ఆయన స్పందించే తీరు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయనకొచ్చిన క్రియేటివ్ థాట్స్ మరెవరికీ రావంటే అతిశయోక్తి కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్‌పైనే ఆయన విమర్శలు ఎక్కు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మేయర్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానిలో ఆమె ఓ చేత్తో కుక్కకు తినిపిస్తూ.. మరో చేత్తో తాను టిఫిన్ చేస్తున్నారు. అది కూడా ఒక ప్లేటులో ఉన్న టిఫిన్.. కుక్కకు తినిపిస్తూ ఆమె కూడా తినడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో కంటే ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్లు మరింత వైరల్ అవుతున్నాయి.
మేయర్ వీడియోపై స్పందించిన ఆర్జీవీ... ‘‘కుక్కపై గౌరవనీయులైన మేయర్‌కు అపారమైన ప్రేమ ఉండటంతో.. కుడి చేత్తో కుక్కకు తినిపిస్తూ ఎడమ చేత్తో తాను తింటున్నారు. ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్‌గా ఎంపిక చేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఆమె కుక్కపై చూపుతున్న ప్రేమకు దీటుగా ప్రజలను ప్రేమించగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కుక్కను ఆమె అంతగా ప్రేమించడాన్ని చూస్తుంటే మరో జన్మలో నేనూ కుక్కగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఇంతగా ఆమె తన కుటుంబాన్ని, తన పార్టీని, తెలంగాణ ప్రజలను కూడా ప్రేమిస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవంగా కుక్కను చూసి అందరూ ఈర్ష్య చెంది ఉంటారు’’ అని ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments