ముళ్ల పంది.. మహా లఫూట్ ఏంటీ రచ్చ ఆర్జీవీ!
- IndiaGlitz, [Sunday,February 24 2019]
అంతా నా ఇష్టం.. నేనింతే ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా నాకు ఓకే.. నా దారి రహదారి కాదు అడ్డదారి.. సంచనాలకు కేరాఫ్ నేనే.. నా తర్వాతే మిగతావారెవరైనా అంటూ మిగతా వారితో పోలిస్తే టూ డిఫరెంట్‌గా ఉంటాడు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.
ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే ఒక సంచలనం అయితే నాటి నుంచి నేటి వరకు ఎన్ని ట్విస్ట్‌లు ఇచ్చారో..? ఎన్ని వివాదాల్లో మునిగి తేలారో..? ఆ పెరుమాళ్లకే ఎరుక. బహుశా ఈయనకు ఉన్నంత మంది అభిమానులు పెద్ద పెద్ద హీరోలకు సైతం ఉండరంటే అతిశయోక్తి లేదేమో. అదీ ఆర్జీవీ రేంజంటే.. అలా మూడు గొడవలు ఆరు వివాదాలతో మధ్యలో వోడ్కాతో వర్మ జీవితం సాగిపోతంది!
ఇక ఆర్జీవీ సినిమాలు విషయానికొస్తే.. ఈయన సినిమాలకు ప్రత్యేకంగా ప్రీ రిలీజ్, ఆడియో రిలీజ్, సక్సెస్ ఇలా ఈవెంట్‌లు జరిపిన సందర్భాలు ఒకటి అర తప్ప దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. ఆయనకు సోషల్ మీడియానే పెద్ద ఆస్తి.. పబ్లిసిటీ కూడా అంతేకాదండోయ్.. వివాదాల పుట్టను ఇక్కడ్నుంచే చెలరేపుతాడు ఆర్జీవీ. ఆయన తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఫ్రీ పబ్లిసిటీ ఇప్పటికే ప్రారంభించేశాడు. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకులు వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముఖ్యంగా కోర్టుల వ్యవహారాలు వచ్చినా ఆర్జీవీ మాత్రం వెనకడుగేయలేదు. అయితే ఈ మధ్య ఆర్జీవీకి మరో కొత్త జబ్బు సోకింది అదేంటంటే తనను తానే విపరీతంగా తిట్టేసుకుంటున్నాడు.. ఇది లైవ్‌లో కూర్చున్నా ముఖ్యంగా సోషల్ మీడియాకెక్కితే విపరీతంగా ముదిరిపోతోంది!
నేనొక ముళ్ల పంది..!
ఇటీవల ఓ చానెల్‌లో డిబెట్‌లో ఆర్జీవీ మాట్లాడుతూ.. అవును నేను ముళ్ల పందినే ‘నేను ఒక ముళ్లపందిని’.. ముళ్ల పందిని ముళ్లు వద్దంటే పందిగా వస్తాను(నవ్వుతూ). పందులే ముళ్లపందుల గురించి ఆలోచిస్తాయి. ముళ్ల పంది పందుల గురించి ఆలోచించదు. నేను చీప్ పబ్లిసిటీ చేస్తానా..? కాంట్రవర్సీ చేస్తానా..? కాకపోతే ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడతానా..? అనేది పాయింట్ కాదు. అవును నేను ముళ్లపందిని.. నన్ను నేనే తిట్టుకుంటున్నాను. అందుకే పందులు.. ముళ్ల పందులకు సలహా ఇవ్వకూడదు అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
నేనో మహా లఫూట్..!
అయితే తాజాగా.. ట్విట్టర్ వేదికగా మరోసారి తనపై తానే తిట్ల వర్షం కురిపించుకున్నాడు. ఇటీవల ఓ పాత ఫొటో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్, అలనాటి తార శ్రీదేవి, ఆర్జీవీ ఉన్నారు. పోస్ట్ చేశాడు అంతటితో ఓకే. ఈ ఫొటోకు చిన్న క్యాప్షన్ ఇవ్వడంతో రచ్చరచ్చైంది. చివరి లెఫ్ట్‌లో ఉన్న మహా లఫూట్ వెధవని నేనే. నా గ్లాసు నేను నిజాయితీపరుడ్ని కాబట్టి దాయట్లేదు.
కొంతమంది దాస్తున్నారు అంతే తేడా అని ఆర్జవీ తనపై తాను తిట్ల వర్షం కురిపించుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు, ఫాలోవర్స్ అసలేమైంది ఆర్జీవీకి.. ఏంటీ రచ్చ.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరే నిందించుకోవడం, పొగుడుకోవటం మీకే చెల్లింది గురువుగారు... వాస్తవానికి తన లోటుపాట్లను కూడా నిజాయితీగా ఒప్పుకోవటం ఒక కళ.. మిమ్మల్ని అభిమానిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను అని ఓ అభిమాని ఆర్జవీకి ట్వీట్ చేశాడు.