సూపర్ ఫైన్‌గా ఉన్నా.. డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ: వర్మ

తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకు వర్మ డంబెల్స్‌తో సిద్ధమై పోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో చేశారు. ఇటీవల తాను అనారోగ్యంతో ఉన్నానంటూ కొన్ని మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయని.. వాళ్లందరినీ డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ చెప్పారు. తాను సూపర్ ఫైన్‌గా ఉన్నానని ప్రస్తుతం నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తున్నానని వర్మ తెలిపారు.

''నేను విపరీతమైన జ్వరంతో అనారోగ్యంగా ఉన్నానని, నాకు కోవిడ్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోందని కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. నిజం ఏంటంటే.. నేను ఫిట్‌గా ఆరోగ్యంగా ఉన్నా. ఇంట్రస్టింగ్ సినిమాలను తెరకెక్కిస్తున్నందున నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తున్నా. నేను అనారోగ్యంతో ఉన్నానని భావిస్తున్న వాళ్లందరినీ డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ. సూపర్ ఫైన్’’గా ఉన్నాను అని వీడియోలో తెలిపారు.