ఆ డిజాస్టర్ హీరోయిన్‌ను సరికొత్తగా మార్చిన వర్మ..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సినిమాలకు పైసా ఖర్చు లేకుండా ప్రతి గడపకూ తన సినిమాను చేర్చగల దిట్ట. ఆయన సినిమాల్లో ముఖ్యంగా హీరోయిన్స్‌కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా ఆయన ఓ హీరోయిన్‌ని పేరు, వేషం కూడా మార్చేశారు. అయితే ఆమె గతంలో నటించిన ‘4 లెటర్స్’ అనే సినిమా డిజాస్టర్ కావడంతో పెద్దగా ఆ హీరోయిన్ ఎవరికీ తెలియదు. ఆమె పేరు అనికేత మహారాణా. ఇప్పుడామె వర్మ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడామె పేరు అప్సరగా మార్చారు వర్మ. అయితే అప్సర తన కొత్త పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఏడు గంటల్లోనే 10 వేల మంది ఆమెను ఫాలో అవడం విశేషం. మరి ఈ సినిమా ఆమెకు ఎంతమేరకు కలిసొస్తుందో చూడాలి.