నెటిజన్లకు వర్మ పరీక్ష
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉండే వర్మ.. నేడు ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చంద్రబాబును పోలిన వ్యక్తి ఒకరు హోటల్లో భోజనం చేస్తున్న వారికి చట్నీ వడ్డిస్తూ కనిపించారు. `ఈ వ్యక్తి ఎవరో కనిపెట్టడానికి నాకు ఎవరైనా సహాయం చేస్తారా? ఆయన్ని పరిచయం చేసిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాను.
ఆయన గురించి వివరాలు తెలిస్తే.. Laksmisntr@gmail.comకు వివరాలను పంపండి. మొదట వివరాలు పంపిన వారికే లక్ష రూపాయలు అందచేయబడుతుంది` అని కామెంట్స్ కూడా పెట్టారు. ఇలా చంద్రబాబును పోలిన వ్యక్తిని వర్మ వెతకం వెనుక.. `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో చంద్రబాబు పాత్ర కోసమే అని కామెంట్స్ వినపడుతున్నాయి. విజయదశమికి `లక్ష్మీస్ ఎన్టీఆర్` ప్రారంభం కానుంది. నెటిజన్లకు వర్మ ఓ రకంగా చిన్నపాటి పరీక్ష పెట్టారు. నెటిజన్లు కొందరు దీనిపై తమ కామెంట్స్ పెట్టారు.
Anybody who can track him can give his contact details via email at Laksmisntr@gmail.com ..The reward of 1 lak will be given to the first person who does that #NTRTRUESTORY pic.twitter.com/ShBakNJgEY
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2018
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments