నెటిజ‌న్ల‌కు వ‌ర్మ ప‌రీక్ష‌

  • IndiaGlitz, [Saturday,October 13 2018]

వివాదాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండే వ‌ర్మ‌.. నేడు ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చంద్ర‌బాబును పోలిన వ్య‌క్తి ఒక‌రు హోట‌ల్‌లో భోజ‌నం చేస్తున్న వారికి చ‌ట్నీ వ‌డ్డిస్తూ క‌నిపించారు. 'ఈ వ్య‌క్తి ఎవ‌రో క‌నిపెట్ట‌డానికి నాకు ఎవ‌రైనా స‌హాయం చేస్తారా? ఆయ‌న్ని ప‌రిచ‌యం చేసిన వారికి ల‌క్ష రూపాయ‌లు బ‌హుమ‌తిగా ఇస్తాను.

ఆయ‌న గురించి వివ‌రాలు తెలిస్తే.. Laksmisntr@gmail.comకు వివ‌రాల‌ను పంపండి. మొద‌ట వివ‌రాలు పంపిన వారికే ల‌క్ష రూపాయ‌లు అందచేయ‌బ‌డుతుంది' అని కామెంట్స్ కూడా పెట్టారు. ఇలా చంద్ర‌బాబును పోలిన వ్య‌క్తిని వ‌ర్మ వెత‌కం వెనుక‌.. 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'లో చంద్ర‌బాబు పాత్ర కోసమే అని కామెంట్స్ విన‌ప‌డుతున్నాయి. విజ‌య‌ద‌శ‌మికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రారంభం కానుంది. నెటిజ‌న్ల‌కు వ‌ర్మ ఓ ర‌కంగా చిన్న‌పాటి ప‌రీక్ష పెట్టారు. నెటిజ‌న్లు కొంద‌రు దీనిపై త‌మ కామెంట్స్ పెట్టారు.