నాలుగు భాష‌ల్లో 'భైర‌వ‌గీత‌'

  • IndiaGlitz, [Wednesday,October 24 2018]

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'భైర‌వ గీత‌'. రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ రా ల‌వ్‌స్టోరీగా సినిమా రూపొందుతుంది. రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ హ‌త్య‌ల నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఎలాంటిదో 'భైర‌వ‌గీత' చూడాల్సిందే. ధ‌నుంజ‌య‌, ఇర్రా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి టి.సిద్ధార్థ ద‌ర్శ‌కుడు.

ఈ సినిమానె తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఎట్ట‌కేల‌కు సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. న‌వంబ‌ర్ 22న సినిమా విడుద‌ల కాబోతుంది. ప్ర‌స్తుతం రా ఎమోష‌న్స్ ఉన్న సినిమాల‌కు ఆద‌ర‌ణ దొరుకుతుంది. ఇలాంటి త‌రుణంలో 'భైర‌వ‌గీత'లో ఏం చెప్పాల‌న‌కుంటున్నారో చూడాలంటే న‌వంర్ 22 వ‌ర‌కు ఆగాల్సిందే..