మరో వివాదానికి రాంగోపాల్ వర్మ శ్రీకారం
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడెవరంటే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. ఈయన ప్రస్తుతం `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సందీప్ మాధవ్(సాండీ)తో `దాదాస్ ఆఫ్ హైదరాబాద్` అనే సినిమాను రూపొందించబోతున్నట్లు వర్మ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీట్ ద్వారా తెలిపారు. ``ఇప్పుడే `జార్జిరెడ్డి` సందీప్ మాధవ్‌తో సైన్ చేయించాను. తనతో `దాదాస్ ఆఫ్ హైదరాబాద్` సినిమాను తెరకెక్కించబోతున్నాను. 80 దశకంలో హైదరాబాద్‌లోని రౌడీలకు సంబంధించిన సినిమా చేస్తాను. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు చెందిన సినిమాల తర్వాత ఈ సినిమా చేస్తాను. నా శివ సినిమాకు ఇన్స్పిరేషన్గా నిలిచిన నిజమైన పాత్రను ఇందులో చూపిస్తాను`` అన్నారు రామ్‌పాల్ వర్మ.
`ఎన్టీఆర్ లక్ష్మీస్`, `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` సినిమాలతో పొలిటికల్ సెటైర్ మూవీస్‌ను తెరకెక్కించిన రామ్‌గోపాల్ వర్మ ఇటీవల `రెడ్డి రాజ్యంలో కమ్మ ఫ్యాన్స్` అనే సినిమాను వల్లభనేని వంశీ ఘటనల ఆధారంగా రూపొందించాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు. కాగా ఇప్పుడు `దాదాస్ ఆఫ్ హైదరాబాద్`ను చేయబోతున్నట్లు తెలిపారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. సందీప్ మాధవ్‌కు `వంగవీటి`సినిమాతో బ్రేక్ ఇచ్చింది రామ్‌గోపాల్ వర్మే. ఇప్పుడు మరోసారి అదే హీరోతో వర్మ సినిమా చేయనుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com