ఆర్జీవీ మరో సంచలనం.. కేసీఆర్‌పై సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ ఇప్పటికే పలు బయోఫిక్‌లు, వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్నీ బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించిన.. తెలంగాణ జాతిపిత, గాంధీగా పేరుగాంచిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరిట సినిమాను తెరకెక్కించేందుకు ఆర్జీవీ సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఆంధ్రుల అన్నగారు నందమూరి తారకరామారావు సినిమా తీసిన ఆర్జీవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసినప్పటికీ ఆంధ్రాలో మాత్రం ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. అంతేకాదు ఆ సినిమా అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత.. ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ ఇద్దరి పేరిట ‘శశికళ’ అనే మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లక ముందే తాజాగా ‘టైగర్.. కేసీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ఈ టైటిల్‌కు రెండు సబ్ టైటిల్స్ కూడా ఆర్జీవీ ఇచ్చారు. ‘కేసీఆర్ టైగర్.. ది అగ్రెసివ్ గాంధీ’ అని.. ‘ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్వ్రిండ్రు’ అనే సబ్ టైటిల్స్ ను వర్మ పోస్ట్ చేశారు. కాగా.. ఈ సినిమాలో నటీనటుల విషయమై త్వరలోనే వర్మ మరిన్ని విషయాలను వెల్లడించే అవకాశముంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సీఎం కేసీఆర్‌పై జీవితం, తెలంగాణ ఉద్యమంపై ‘ఉద్యమ సింహం’ అనే సినిమా ఇప్పటికే విడుదలై పెద్దగా హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది!. అయితే ఆర్జీవీ తెరకెక్కిస్తున్న టైగర్.. కేసీఆర్ ఏ మాత్రం మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే మరి.
కాగా.. సినిమా తీస్తే తీశావ్ గానీ.. అందులో ఆంధ్రోళ్లను మంచిగా చూపించండి సారూ.. ఒకర్ని ఎక్కువ.. ఇంకొకర్ని తక్కువ చేసి చూపించకుండా జర మంచిగా చూపించే ప్రయత్నం చేయండి అంటూ నెటిజన్లు, అభిమానులు ఆయన సలహాలిస్తున్నారు. మరికొందరు అభిమానులు కేసీఆర్ బయోపిక్ తీస్తున్న అదే చేత్తో కేఏ పాల్ ది కూడా తీయండి అంటూ ఆర్జీవీని ప్రాధేయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments