వర్మ కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. రీసెంట్గా నాగార్జున, వర్మ చేసిన `ఆఫీసర్` డిజాస్టర్ అయ్యింది. అయితే వర్మ ప్లాప్‌తో సంబంధం లేకుండా తన కొత్త ప్రాజెక్ట్‌ను కొన్నిరోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాడు.
'వైరస్' పేరుతో ఈ సినిమా రూపొందనుంది. 'సర్కార్', '26/11' చిత్రాల నిర్మాత పరాగ్ సంఘ్వీ ఈ సినిమాను నిర్మిస్తారు. 'ఎబోలా కంటే ప్రమాదకరమైన వైరస్ భారిన ముంబై పడుతుంది. దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదే సినిమా కాన్సెప్ట్` అని నిర్మాత పరాగ్ సంఘ్వీ తెలిపారు.
`సెంట్రల్ ఆఫ్రికాకు వెళ్లిన యువకుడుకి ప్రమాదకరమైన వైరస్ సోకుతుంది. తను ముంబై చేరుకుంటాడు. తన నుండి అందరికీ ఆ వైరస్ సోకుతుంది. దాని కారణంగా లక్ష మంది చనిపోతారు. రెండు కోట్ల మంది నివసించే ముంబై నగరం దాటి ఎవరూ వెళ్లకూడదని ప్రభుత్వం ఆర్డర్ వేస్తుంది. అందుకు కారణం.
ఆ వ్యాధి ఇతర నగరాలకు వ్యాపించకూడదని, ఎవరైనా నగరం విడిచి వెళ్లాలంటే వారిని కాల్చేయమని ప్రభుత్వమే ఆర్డర్ వేస్తుంది. అప్పుడు ముంబైలో ప్రజలు ఏం చేస్తారు. ఇలా భయం, బాధ, త్యాగం, ప్రేమ వంటి అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నా` అని వర్మ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments