నిజ ఘటన ఆధారంగా సినిమా అనౌన్స్ చేసిన వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
నిజ ఘటనలు ఆధారంగా సినిమాలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. 26/11 వంటి సినిమా ఆయన తెరకెక్కించిన ఈ తరహా చిత్రాలకు ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు మరోసారి వర్మ అలాంటి ప్రయత్నం చేయబోతున్నారు. వివరాల్లోకెళ్తే కొవ్వూరులో జరిగిన పరువు హత్య ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అమృత, ప్రణయ్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. అది నచ్చని ఆమె తండ్రి మారుతీరావు ప్రణయ్‌ను హత్య చేయించాడు. కోర్టులో కేసు నడుస్తుండగానే మారుతీ రావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రణయ్ హత్యపై పెద్ద కలవరం జరిగింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని మర్మ మర్డర్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. నట్టి కుమార్ కుమార్తె కరుణ, కుమారుడు క్రాంతి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆనంద్ చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
కుమార్తెను ఎక్కువగా ప్రేమించడం కూడా ప్రమాదమే అని అంటూ ఫాదర్స్ డే సందర్భంగా ఓ దుఃఖ పూరితంగా ముగిసిన తండ్రి కథతో మర్డర్ సినిమా చేయబోతున్నట్లు వర్మ తెలిపారు. ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. మరో పక్క నగ్నం అని తన స్టైల్ ఆఫ్ అడల్డ్ కంటెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇది ఆర్టీవీ వరల్డ్ యాప్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ అందులో అడల్ట్ కంటెంట్‌ను ఎక్కువగా చొప్పించే ప్రయత్నం చేశాడు. నగ్నం సినిమాను చూడాలంటే ఫర్ వ్యూ రెండు వందల రూపాయలను చెల్లించాలని వర్మ తెలిపాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments