చంద్రబాబుకు , పోలీసులకు ఆర్జీవీ 16 ప్రశ్నాస్త్రాలు

  • IndiaGlitz, [Monday,April 29 2019]

విజయవాడలో ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రబృందం నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌‌ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ, నిర్మాత రాకేశ్ రెడ్డితో పాటు చిత్రబృందాన్ని బలవంతంగా ఎయిర్‌పోర్టుకు తరలించి హైదరాబాద్ ఫ్లైట్‌కు బలవంతంగా పంపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 8గంటలకు వరకు ఏడుగంటలపాటు ఈ మొత్తం ఎపిసోడ్ జరిగింది. రాత్రి 8:30 గంటలకు ఆర్జీవీ అండ్ టీమ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చేశారు. ఇంటికి చేరుకున్న అనంతరం రామ్‌గోపాల్ వర్మ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, విజయవాడ పోలీసులు 16 ప్రశ్నలు సంధించారు. అంతటితో ఆగని తన 16 ప్రశ్నలకు.. 16 గంటల్లోగా సమాధానమివ్వాలని లేకుంటే కోర్టుకెళ్లి తన హక్కులు సాధించుకుంటానని ఆర్జీవీ హెచ్చరించారు.

ఆర్జీవీ ప్రశ్నాస్త్రాలు ఇవీ...

అసలు నన్ను ప్రెస్‌మీట్ పెట్టకుండా ఎందుకు ఆపారు..? తన కారును ఆపేందుకు మీ ఏ అర్హత ఉంది..? నా కారు ఆపాల్సిన అవసరం ఏంటి? తమకు ఆదేశాలున్నాయని పోలీసులు అంటున్నారు, ఆ ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలి? నా కారును ఆపి వెనక్కి పంపాలని మీకు ఎవరు ఆర్డర్స్ పాస్ చేశారు..? నన్ను కలవడానికి వచ్చిన వారిని ఎందుకు మీరు కలవనివ్వకుండా ఏడు గంటలపాటు ఇబ్బందిపెట్టారు..? నా స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కును హరించే హక్కు మీకు ఎవరిచ్చారు..? అసలు నన్ను పోలీసులు ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారు..? పోలీసులు రాజకీయ నేతలు ఆడించే యంత్రాగాలా..? చంద్రబాబు గారు.. ఇది ఒక ప్రజాస్వామ్య భారతదేశమా..? లేదా నియంతృత్వ ఆంధ్రప్రదేశా? ఇలా ఒకట్రెండు కాదు 16 ప్రశ్నలు అటు పోలీసులు.. ఇటు చంద్రబాబుకు ఆర్జీవీ సంధించారు. ఈ మేరకు తన 16 ప్రశ్నలను ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్టు చేసిన వర్మ దాని లింకును ట్విట్టర్‌లో పెట్టారు. అయితే 16 గంటలు కౌంట్ డౌన్ ఇచ్చిన ఆర్జీవీ.. స్పందించకపోతే లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఆర్జీవీ ప్రెస్‌మీట్‌ను ఎందుకు అడ్డుకున్నామో కారణాలను విజయవాడ పోలీసులు ఓ ప్రకటన రూపంలో వివరించిన విషయం విదితమే. అయితే తాజా ఆర్జీవీ సంధించిన ప్రశ్నాస్త్రాలకు విజయవాడ పోలీసుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

‘కాంచన’ రీవేుక్‌లో అమితాబ్.. హిజ్రా పాత్ర‌లో

తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన ‘కాంచన’ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.

జ‌న‌సేన పార్టీ అంటేనే ధైర్యం… పోరాటం చేయ‌డం!

జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ

ఆర్జీవీ ప్రెస్‌మీట్‌ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారంటే...

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు యత్నించి విఫలమైన సంగతి తెలిసిందే.

షాక్ నుంచి ఇంకా తేరుకోలేకున్నా.. సీటు బెల్ట్ వల్ల బతికా!

హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళ్తున్న 'నువ్వు తోపురా' చిత్ర బృందంకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌ మరో విషాదం.. సీనియర్ ఆర్టిస్ట్ మృతి

టాలీవుడ్‌ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ప్రముఖ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.