మల్టీస్టారర్ లో రేయ్ భామ

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం రేయ్' విడుదల్లో జాప్యం జరిగి రెండో చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన సయామీ ఖేర్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా..బాలీవుడ్ బ్యూటీని తర్వాత అవకాశాలు పలకరించలేదు. అయితే తాజా సమాచార ప్రకారం ఈ అమ్మడు, కార్తీ, నాని హీరోలుగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న రీవేంజ్ డ్రామా లో దర్శనమీయనుంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలే కన్ ఫర్మ్ చేశాయి.

అయితే హీరోయిన్ గా నటిస్తుందా లేదా కీలకపాత్రలో చేస్తుందా అనేది తెలియలేదు. ప్రస్తుతం మిర్జియా' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సయామీకి మణిరత్నం ఎలాంటి బ్రేక్ ఇస్తాడో చూడాల్సిందే...