అఖిల్ టీజర్ రివ్యూ...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని మూడోతరం కథానాయకుడుగా అఖిల్ సినీ రంగ ప్రవేశం గురించి అక్కినేని అభిమానులే కాదు, సినీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అసలు ఎప్పుడెప్పుడు అఖిల్ ఎంట్రీ ఇస్తాడా? అసలు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అందరూ ఉహించినట్టే సెన్సేషనల్ డైరెక్టర్, కమర్షిలయ్ ఎంటర్ టైనర్స్ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నితిన్ నిర్మాతగా సినిమా అని వార్త బయటకు రాగానే ఇక మాస్ ఎలిమెంట్స్ కి తిరుగుండదు అని అనుకున్నారు.
ఫస్ట్ లుక్ గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. అందరూ ఎదురుచూసినట్లు అఖిల్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. మేకింగ్ వీడియోలో అఖిల్ చేసిన యాక్షన్ పెర్ ఫార్మెన్స్ చూసిన అక్కినేని అభిమానుల సంతోషానికి అవధులు లేకపోయింది. సగటు ప్రేక్షకుడు మాత్రం టాలీవుడ్ సరికొత్త మాస్ హీరో పరిచయం అవతున్నాడని అనుకున్నారు. సెప్టెంబర్ 20 ఆడియో, అక్టోబర్ 21 సినిమా విడుదల అని అనౌన్స్ కూడా చేసేయడంతో ఇక మిగిలించి లాంఛనమే అయినా అఖిల్ కున్న క్రేజ్ మాత్రం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. తాజాగా ఈరోజు అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో అఖిల్ ఎలా ఉంటాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
ఆ రివ్యూ చూడండి...
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ నేమ్, నిఖితా రెడ్డి సమర్పణ, హీరో నితిన్ ప్రొడక్షన్ అనే టైటిల్స్ తో టీజర్ స్టార్టయింది. ఓ స్టార్ మార్కున్న చేయి విలన్ ని తాకడం, లెగసీ ఆఫ్ స్టయిల్ అనే మళ్లీ టైటిల్ రావడం, బ్యాక్ పోజిషన్ నుండి అఖిల్ రన్నింగ్, మళ్లీ లెగసీ ఆఫ్ ఛరిష్మా అనే టైటిల్ మళ్లీ హీరో గాల్లోకి జంప్ చేయడం, నీటిలోకి దూకడం, లెగసీ ఆఫ్ వెర్సటాలిటీ అనే టైటిల్ రావడం జరుగుతాయి. ఆ తర్వాతే అఖిల్ ఫేస్ ను చూపించారు.
ఛార్మినార్ లోకేషన్ అఖిల్ మాస్ లుక్ అదిరిపోయిందనాలి. వి.వి.వినాయక్ ఫిలిం అనే టైటిల్ వస్తుంది. ఆ తర్వాత మళ్లీ స్పెయిన్ లో షూట్ చేసిన యాక్షన్ పార్ట్ టీజర్ తో అఖిల్ అని సౌండింగ్ తో కూడిన టైటిల్ వస్తుంది. దాంతో పాటు చివర్లో అఖిల్ యాక్షన్ చూపిస్తారు. చివర్లో థాంక్యూ సర్ ఫర్ ఎవర్ గ్రీన్ లెగసీ, హ్యపీ బర్త్ డే టు కింగ్ నాగార్జున, లెగసీ లివ్స్ ఆన్ అని టైటిల్స్ వస్తాయి. చివర్లో ఫస్ట్ లుక్ తో ఉన్న అఖిల్ కనపడతాడు దాంతో టీజర్ ముగుస్తుంది. మొత్తం టీజర్ లో అఖిల్ లుక్స్ పైనే కాన్ సన్ ట్రేషన్ చేశారు. ఎటువంటి డైలాగ్స్ వినపడవు.
కేవలం యాక్షన్ పార్ట్ లోని కొన్ని సన్నివేశాలో టీజర్ ఉంది. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. అనూప్, థమన్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండటం వల్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరిచ్చారనేది తెలియడం లేదు కానీ మాస్ సౌండింగ్ వింటుంటే బ్యాక్ గ్రౌండింగ్ స్కోర్ థమన్ అందించినట్టు ఉంది. ఆల్ ఓవర్ టీజర్ చెప్పుకోదగ్గ అంశాలివే. అఖిల్ మాస్ స్టయిల్ ను ప్రెజంట్ చేశారు. ఇక మిగిలిన విషయాలు కావాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout