'రుద్రమదేవి'కి రివర్స్ సెంటిమెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
గుణశేఖర్.. ఈ పేరు వింటే 'సొగసు చూడతరమా', 'రామాయణం', 'చూడాలని ఉంది', 'ఒక్కడు' వంటి క్లాసిక్స్ అనదగ్గ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్.. తలుచుకుంటే కించిత్ భయం పుట్టించే డిజాస్ట్రస్ ఫిల్మ్స్ కూడా గుర్తుకు వస్తాయి. ఇలా రెండు రకాల చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న గుణశేఖర్ ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి రూపొందిన హిస్టారికల్ త్రీడీ చిత్రం 'రుద్రమదేవి. ఈ నెల 9న ఈ సినిమా విడుదల కానుంది. అనుష్క, అల్లు అర్జున్, నిత్యా మీనన్, రానా వంటి జనాకర్షణ ఉన్న తారలు ఈ సినిమాలో ఉండడం కలిసొచ్చే అంశమే.
ఇదిలా ఉంటే.. గుణశేఖర్ దర్శకత్వంలో ఓ హీరో రెండోసారి నటిస్తే ఆ చిత్రం మొదటి చిత్రానికి వ్యతిరేకంగా ఫలితం పొందుతుంది. చిరంజీవితో రెండు సినిమాలు తీసిన గుణకి.. తొలి చిత్రం 'చూడాలని ఉంది' బ్లాక్‌బస్టర్ హిట్ ఇస్తే.. రెండో చిత్రం 'మృగరాజు' పట్టపగలే చుక్కలు చూపే నెగెటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఇక మహేష్‌బాబుతో మూడు సినిమాలు తీసిన గుణకి మొదటి చిత్రం 'ఒక్కడు' మెమరబుల్ హిట్ ఇస్తే.. రెండో చిత్రం 'అర్జున్' నెగెటివ్ రిజల్ట్ ఇచ్చింది. మూడో చిత్రం 'సైనికుడు' అయితే కోలుకోలేని దెబ్బ తగిలించింది. మొత్తమ్మీద.. ఆయా హీరోలతో రెండో చిత్రాలు మొదటి చిత్రాలకు భిన్నంగా ఫలితాలను పొందాయన్నమాట.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో తొలిసారిగా 'వరుడు' తీసి దెబ్బతిన్న గుణ.. రెండోసారి తెరకెక్కించిన 'రుద్రమదేవి' కోసం రివర్స్ సెంటిమెంట్‌తో భారీ హిట్ కొడతాడేమో చూడాలంటున్నారు పరిశీలకులు. ఆల్ ది బెస్ట్ టు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments