BiggBoss: రేవంత్ చెత్త రూల్స్.. ఆదికి ఫేవర్, రోహిత్ విశ్వరూపం
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. మూడు రోజుల నుంచి ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వాలని కిందా మీదా పడుతున్నారు. పాము నిచ్చెన టాస్క్ నుంచి నేటి వరకు హౌస్‌మేట్స్ హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే ఎందుకో తెలియదు కానీ.. మన అగ్రెసివ్ స్టార్ రేవంత్ దిగాలుగా కనిపించాడు. తాను గేమ్‌లో ఫిజికల్ కాకున్నా.. అయ్యానని అంటున్నారని, ఎంత కష్టపడి ఆడినా తనకు ఫలితం రావడం లేదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు బిగ్‌బాస్ హౌస్‌లోకి రాకుండా వుండాల్సిందంటూ వాపపోయాడు. అతని బాధను చూసిన మెరీనా.. రేవంత్‌ను ఓదారుస్తూ కన్నీరు తుడిచింది. అర్ధరాత్రి భార్య ఫోటోను చూస్తూ.. ఆమెను తలచుకుంటూ ఎలాగైనా టైటిల్ కొట్టే ఇంటికి వస్తానని శపథం చేశాడు. తర్వాత రేవంత్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాల్సిందిగా ఆదేశించాడు.
దీంతో కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన శ్రీసత్య, కీర్తి, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, మెరీనాలు పోటీపడ్డారు. వీరందరికీ థర్మాకోల్ బాల్స్‌తో నింపిన గోనె సంచిని ఇచ్చారు. వాటిని వీపుపై మోస్తూ.. మూడు భాగాలుగా వున్న సర్కిల్స్‌లో తిరగాలి. ఆ బ్యాగ్స్‌కి రంధ్రాలు వుంటాయి. వాటి నుంచి థర్మాకోల్ బాల్స్ పడిపోకుండా... తోటి కంటెస్టెంట్స్ నుంచి రక్షించుకుంటూ తిరుగుతూ వుండాలి. చివరికి ఎవరి సంచిలో ఎక్కువ థర్మాకోల్స్ వుంటాయో వారు నెక్ట్స్ రౌండ్‌కి వెళ్తారు.
అయితే టాస్క్‌కి సంచాలక్‌గా వున్న రేవంత్ తనకు ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టాడు. దీంతో శ్రీసత్య ఫైర్ అయ్యింది. ఇక్కడా మనోడు యాటిట్యూడ్ చూపించాడు. తాను సంచాలక్‌నని తన ఇష్టం వచ్చినట్లుగా చేస్తానని తేల్చిచెప్పాడు. ముఖ్యంగా ఆదిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించాడు రేవంత్. బ్యాగ్ చేత్తో పట్టుకుంటే ఔట్ అని చెప్పాడు. రోహిత్ అసలు చేత్తో బ్యాగ్ పట్టుకోలేదు.. కానీ ఆదిరెడ్డి గట్టిగా చేతులతో పట్టుకున్నా రేవంత్ ఏం మాట్లాడలేదు. అంతేకాదు రోహిత్‌ని ఔట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో అతనికి కోపం నషాళానికి అంటింది. ఎన్నడూ లేని విధంగా ఫైరయ్యాడు. అటు రోహిత్‌కు మద్ధతుగా మెరీనా కైడా రంగంలోకి దిగింది. సంచాలక్ చూడకపోయినా జనం చూస్తున్నారని మెరీనా చెప్పడంతో రేవంత్‌కి కోపం కట్టలు తెంచుకుంది. నోరు జారుతున్నాడని.. బ్యాగ్ విసిరి కొట్టాడని బిగ్‌బాస్‌కి కంప్లయంట్ చేశాడు. ఫైనల్‌గా అద్భుతంగా ఆడి ఫైమా ఈ వారం కెప్టెన్‌గా అవతరించినట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే ఈ వారం బాలాదిత్య, మెరీనా, ఫైమా, వాసంతి, కీర్తి, ఇనయా, శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్‌లు నామినేషన్స్‌లో వుండగా.. శ్రీసత్య, వాసంతి, రోహిత్‌లు సేఫ్ సైడ్ వున్నారు. గడిచిన రెండు వారాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా వున్న సూర్య, గీతూలు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం మరి ఎవరు ఇంటి ముఖం పడతారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com