BiggBoss: రేవంత్ బూతు పురాణం... ఆదిరెడ్డికి మస్కా కొట్టిన గీతూ, సూర్య జ్ఞాపకాలతో ఇనయా

  • IndiaGlitz, [Friday,November 04 2022]

బిగ్‌బాస్ 6 తెలుగులో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ యమ జోరుగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అంతా పులుల్లా రెచ్చిపోతున్నారు. మధ్యలో కొందరు తమ స్ట్రాటజీలు వాడాలని ప్రయత్నిస్తున్నా అవి విఫలమవుతున్నాయి. దీంతో కంటెస్టెంట్స్ నోటికి పనిచెబుతున్నారు. నిన్న శ్రీహాన్, శ్రీసత్యలపై ఇనయా చేసిన కామెంట్స్ ఇంటిని వేడెక్కించాయి. ఇనయా కూడా ఎలిమినేట్ అయిన సూర్యను తలచుకుంటూ ఓవరాక్షన్ చేసింది. అతని టీ షర్ట్ వేసుకుని ఆడటం, సూర్య ప్లేట్‌లో భోజనం చేయడం లాంటి పనులు చేయడంతో కంటెస్టెంట్స్‌కి చిర్రెత్తుకొచ్చింది. ఇనయా వల్లే సూర్య ఎలిమినేట్ అయ్యాడని ఇప్పటికే నామినేషన్‌లో ఆమెను ఉతికి ఆరేశారు. అయినా ఇనయాలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్లేట్‌పై సూర్య పేరు కనిపించకపోవడంతో ఆమె నానా రచ్చ చేసింది.

మరోవైపు.. వాష్‌రూమ్‌ను డర్టీగా మార్చాలనే సీక్రెట్ టాస్క్‌లో బ్లూ టీమ్ సభ్యులు సక్సెస్ కొట్టారు. దీంతో తమ జట్టులో చనిపోయిన రోహిత్‌ను తిరిగి బతికించారు. అయితే బిగ్‌బాస్ ఇచ్చిన సెకండ్ మిషన్‌లో రెడ్ టీమ్ గెలవడంతో వారు రోహిత్‌ను మరోసారి చంపేశారు. ఇకపోతే.. రేవంత్ ఆటతీరు రోజురోజుకు దిగజారిపోతోంది. ఆడవాళ్లలో పోటీపడలేక.. వారి చేతుల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక నోటికి పనిచెబుతున్నాడు. బూతులతో కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడుతున్నాడు. మొన్నటి మొన్న బ్లూటీమ్‌లో వున్న ఆదిరెడ్డిని ‘‘నా ***డకా’’ అని తిట్టాడు. దీనిపై ఆదిరెడ్డి సీరియస్ అయితే దానికి ముందు , వెనుకా ఏం తగిలించలేదు కదా అని ఎదురు ప్రశ్నించాడు.

ఆడవాళ్ల ప్రైవేట్ పార్ట్స్‌కు కాళ్లు, చేతులు తగులుతున్నా.. కనీసం సంస్కారం లేకుండా ఆడాడు. దీనిపై వాళ్లు నొచ్చుకుంటున్నా.. నా ఇష్టం , నేనే ఇలానే ఆడతానంటూ అడ్డదిడ్డంగా వాదించాడు. ఇనయా విషయంలో అయితే మరి మూర్ఖంగా ప్రవర్తించాడు. ఆమెను ఏం పీకుతావ్ అని మాట్లాడాడు. రోహిత్ మీదకి అలాగే వెళ్లబోగా.. అతను ధీటుగా బదులిచ్చేసరికి రేవంత్ ముఖం పగిలిపోయింది. అంతే నీయమ్మా అంటూ నోరుపారేసుకున్నాడు. అందరి ముందు తిట్టి.. అంతలోనే నేను తిట్టలేదని మాట మార్చడాన్ని రేవంత్‌ అలవాటుగా చేసుకున్నాడు. ఇతని వైఖరి చూస్తుంటే ఈ వారం నాగార్జున చేతిలో చీవాట్లు తప్పేలా కనిపించడం లేదు.

ఇకపోతే.. మన గీతక్క తన దోస్త్ ఆదిరెడ్డిపైనే స్ట్రాటజీ వాడింది. రాత్రికి రాత్రి టీషర్ట్‌లు దొంగిలించాలని ప్లాన్ చేసింది. కానీ ఆదిరెడ్డితో మాత్రం టాస్క్ తిరిగి ప్రారంభమయ్యాకే ఈ పని చేస్తానని చెప్పింది. పాపం మన గీతూ పాప మాటల్ని పూర్తిగా నమ్మేసిన ఆదిరెడ్డి తన పని తాను చూసుకున్నాడు. అతడు అలా వెళ్లగానే ఇంటి సభ్యుల టీషర్ట్స్ దొంగిలించింది. ఎట్టకేలకు తెల్లవారు జామున కానీ గీతూ ప్లాన్ ఏంటో ఆదిరెడ్డికి అర్ధం కాలేదు. గేమ్ ఆన్‌లో లేని సమయంలో ఇలా చేయడం తప్పని ఫైర్ అయ్యాడు. కానీ నాకేం సంబంధం లేదని గీతూ వాదించింది. నువ్వు తీసినట్లు తేలితే ఇంటిలో గీతూ వర్సెస్ ఆదిరెడ్డిగా యవ్వారం మారుతుందని అతను హెచ్చరించాడు.

మరోవైపు... సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం శ్రీసత్య ఈ వారం కెప్టెన్‌గా ఎంపికైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈమె హౌస్‌లో మరో గీతూగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నోటికొచ్చినట్లుగా మాట్లాడటం, ఓవర్ యాటిట్యూడ్ కారణంగా రాబోయే రోజుల్లో ఆమెపై నెగిటివిటీ ఎక్కువయ్యే ప్రమాదం వుంది. మరి శ్రీసత్య కెప్టెన్‌గా ఎంపికయ్యిందో లేదో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.