BiggBoss: ఇట్స్ రివేంజ్ టైమ్.. గీతూ, ఫైమాలపై పగ సాధించిన రేవంత్

  • IndiaGlitz, [Thursday,September 15 2022]

బిగ్‌బాస్ 6 రెండవ వారంలో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సిసింద్రీ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్ ఇంట్లోకి బొమ్మలను పంపారు. ఒక్కో ఇంటి సభ్యుడికి ఒక్కో బొమ్మను ఇచ్చాడు. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. ఎవరైనా అజాగ్రత్తగా వుంటే.. దానిని లాక్కునేందుకు మిగిలిన వారిలో కొందరు కంటెస్టెంట్లు రెడీగా వున్నారు. ఎవరి బొమ్మలైతే పోతాయో లేదంటే ఫౌండ్ ఏరియాలో పడతాయో వారు పోటీ నుంచి తప్పుకోవాల్సిందే.

దీనిలో భాగంగా మంగళవారం నాటి ఆటలో రేవంత్ , సత్య, అభినయలకు సంబంధించిన బొమ్మలను ఎవ్వరికీ తెలియకుండా లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో విసిరేసింది గలాటా గీతూ. అలాగే తన బొమ్మ ఎవరి కంటా కనిపించకుండా స్టోర్ రూమ్ లో దాచేసింది. కానీ రేవంత్ మాత్రం దానిని పసిగట్టాడు. వెంటనే దానిని తీసుకున్న అతను లాస్ట్ వడ్ ఫౌండ్ లో పడేశాడు. అయితే అంతకుముందే గీతూ తెలివిగా బొమ్మపై తన పేరున్న డ్రెస్ ను లాగేసింది. ఆ తర్వాత తన పేరు బొమ్మపై లేదని... మరేవరిదైనా కావొచ్చంటూ కెప్టెన్ బాలాదిత్యతో వాదించింది.

గీతూ పని పట్టిన రేవంత్.. తన ఫోకస్ ఫైమా మీద పెట్టాడు. తొలి వారంలో తనను కెప్టెన్ కాకుండా ఫైమా అడ్డుకుందనే కోపం అతనికి పీకల దాకా వుంది. అందుకే ఆమె మీదా పగ తీర్చుకోవాలని రేవంత్ ఫిక్స్ అయ్యాడు. ఇందుకు బిగ్‌బాస్ ఇచ్చిన రింగ్ టాస్క్ ను ఉపయోగించుకున్నాడు. దీనిలో పాల్గొనే వారంతా ఆ రింగ్‌లో పోరాడుతూ ఎదుటి వారిని రింగ్ లైన్ దాటేలా చేయాలి. ఈ గేమ్ లో ఫైమా, కీర్తి, ఇనయా, ఆరోహి, అర్జున్ కల్యాణ్ వంటి వారు పోటీపడ్డారు. ఈ టాస్క్‌గా సంచాలక్‌గా వున్న రేవంత్.. ఫైమా నిబంధనలకు విరుద్ధంగా షీల్డులతో కాకుండా తన బాడీని ఉపయోగించి ఎదుటివారిని తోసేసింది. దీంతో సంచాలక్‌గా వున్న రేవంత్ ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు . సరిగ్గా సమయం చూసి ఫైమా బొమ్మను దొంగిలించిన అభినయ దానిని లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పడేసింది. ఇంకేముంది ఫైమా టాస్క్ నుంచి బయటకు రాక తప్పలేదు. తనపై రివేంజ్ తీర్చుకున్నారని.. పూర్తిగా ఆడనివ్వకుండా చేశారంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.

తర్వాత కోన్స్ అండ్ స్కూప్స్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. దీనికి ఇనయా సంచాలక్‌గా వ్యవహరించగా రాజశేఖర్ గెలిచాడు. అయితే ఇనయా నిర్ణయాలను కొందరు ఇంటి సభ్యులు తప్పుబట్టారు. సెకండ్ గేమ్‌లో ఆర్జే సూర్య విన్నర్‌గా నిలిచాడు. దీంతో సిసింద్రీ టాస్క్ ముగిసేసరికి ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా చంటి, ఇనయా, సూర్య, రాజ్‌లు నిలిచారు. మరి వీరిలో కెప్టెన్ అయ్యేది ఎవరో.