దోపిడి జరుగుతుంటే కళ్లు మూసుకోవాలా?: రేవంత్

  • IndiaGlitz, [Sunday,September 01 2019]

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ ల తీరుపై ధ్వజమెత్తారు. విద్యుత్ శాఖలో వేల కోట్ల అవినీతి చోటు చూసుకుంటే ప్రశ్నించకూడదా అని ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా విద్యుత్ సంఘాలు ధర్నాకు దిగడం వెనుక ఉన్నది ఎవరో చెప్పాలన్నారు. ఇన్ని రోజులు విద్యుత్ శాఖ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు తెరవెనుక దోస్తులు అని ఆరోపించారు.

భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఆలస్యం తో ఏడాదికి రూ.400 కోట్ల భారం పడుతుందని మండిపడ్డారు రేవంత్. అప్పుల తెచ్చి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి వస్తుందన్నారు. ప్రజాధనం దోచుకుంటున్న కేసిఆర్ కుటుంబానికి బుద్ది చెప్పవలసిన అవసరం ఉందన్నారు. విద్యుత్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. అంతే కాదు బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందని... కేసిఆర్ అనుకూల వర్గం, ప్రతి వర్గాలుగా విడిపోయి అంతర్గత గొడవలు జరుగుతున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్.

More News

బాబు శ్రీ భరత్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా?

టిడిపి... ఏపీలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి..  వైసిపి చేతిలో చావు దెబ్బను చవి చూసింది.

ఆంధ్ర బ్యాంకును విలీనం చేయడం పై వైసీపీ నేతల ఆందోళన

ఆర్థిక మాంద్యం అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన నిర్ణయం తప్పు పడుతున్నారు నేతలు.

'ఎవ‌రు' చిత్రాన్ని నా కెరీర్ హ‌య్య‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చేసిన అంద‌రికీ థ్యాంక్స్ - అడివి శేష్‌

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందిన థ్రిల్లర్ `ఎవరు`.

అసదుద్దీన్ పై రాజా సింగ్ సంచలన ఆరోపణలు

గోష మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ ఆసక్తిగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా చర్చనీయాంశం అయింది.

ఈటెల నివాసానికి అభిమానుల తాకిడి

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నివాసం కిటకిటలాడింది. మేం గులాబీ జెండాకు ఓనర్లం అంటూ వ్యాఖ్యలు చేసిన ఈటెల ను కలిసేందుకు టీఆర్ఎస్ నాయకులు,