దోపిడి జరుగుతుంటే కళ్లు మూసుకోవాలా?: రేవంత్
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ ల తీరుపై ధ్వజమెత్తారు. విద్యుత్ శాఖలో వేల కోట్ల అవినీతి చోటు చూసుకుంటే ప్రశ్నించకూడదా అని ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా విద్యుత్ సంఘాలు ధర్నాకు దిగడం వెనుక ఉన్నది ఎవరో చెప్పాలన్నారు. ఇన్ని రోజులు విద్యుత్ శాఖ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు తెరవెనుక దోస్తులు అని ఆరోపించారు.
భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఆలస్యం తో ఏడాదికి రూ.400 కోట్ల భారం పడుతుందని మండిపడ్డారు రేవంత్. అప్పుల తెచ్చి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి వస్తుందన్నారు. ప్రజాధనం దోచుకుంటున్న కేసిఆర్ కుటుంబానికి బుద్ది చెప్పవలసిన అవసరం ఉందన్నారు. విద్యుత్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. అంతే కాదు బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందని... కేసిఆర్ అనుకూల వర్గం, ప్రతి వర్గాలుగా విడిపోయి అంతర్గత గొడవలు జరుగుతున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout