Revanth Reddy: 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్న.. ఏంటంటే..?
- IndiaGlitz, [Friday,December 29 2023]
కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహరించే ఈ షో దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు చాలా తెలివైన వారే అయి ఉండాలి. ఎందుకంటే అక్కడ అడిగే ప్రశ్నలు చాలా టఫ్‌గా ఉంటాయి. మనకు ఈజీగా ఉన్నట్లుండి అనిపించినా ఆన్సర్లు కన్ఫ్యూజ్‌గా ఉంటాయి. తాజాగా ఈ కార్యక్రమంలో ఓ లేడీ కంటెస్టెంట్ పాల్గొంది. ఆమెను అమితాబ్.. తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు ఆ యువతి సమాధానం చెప్పలేకపోయింది. చివరకు ఆడియన్స్ పోల్ తీసుకుని గట్టెక్కింది.
ఇటీవల ప్రసారమైన ఆ ఎపిసోడ్‌లో రూ.40 వేల ప్రశ్నగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM RevanthReddy)కి సంబంధించిన ప్రశ్న అడిగారు అమితాబ్. అదేంటంటే.. రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు?. ఈ ప్రశ్నకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధప్రదేశ్‌ను ఆప్షన్లుగా ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలియని ఆ యువతి.. వెంటనే తనకును లైఫ్ లైన్ వాడుకుంది. ఇందులో భాగంగా ఆడియన్స్ పోల్ తీసుకుంది. అందులో ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మంది తెలంగాణ అని సమాధానమిచ్చారు. దీంతో ఆమె కూడా ఆడియన్స్ అభిప్రాయానికే మొగ్గు చూపుతూ తెలంగాణను లాక్ చేయాలని కోరింది. చివరకు తెలంగాణ సరైన సమాధానం కావడంతో అమితాబ్ ఆమెను అభినందిస్తూ తర్వాతి ప్రశ్నకు వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 119 సీట్లలో కాంగ్రెస్ 64 స్థానాలు, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానం గెలుచుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా అధిష్టానం ఎంపిక చేయడంతో.. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.