కాంగ్రెస్ గూటికి రేవంత్

  • IndiaGlitz, [Tuesday,October 31 2017]

ఎట్టకేలకు రేవంత్ కాంగ్రెస్ గూటికి చేరారు. తెలుగు దేశం పార్టీ పదవులకు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన నేడు రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయనతో ప్రముఖ నేతలు ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేంనరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల, బోడ జనార్దన్‌, మేడిపల్లి సత్యం తదితరులు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నట్లు తెలిసింది. అధికారికంగా తెలియాల్సి ఉంది.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కుంతియ, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... "కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే, కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. వేలకోట్ల రూపాయల దోపిడీ జరిగింది. బడుగు, బలహీన వర్గాల ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడ్డాయి" అని విమర్శించారు.

యంగ్‌, డైనమిక్‌ లీడర్‌ అయిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని కుంతియా అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబమే లబ్ధి పొందుతోంది తప్ప ఎవరూ సంతోషంగా లేరని కుంతియా అన్నారు.