Revanth Reddy, Komati Reddy:కొడంగల్‌లో రేవంత్ రెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి ఘన విజయం
Send us your feedback to audioarticles@vaarta.com
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అటు కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 56వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందగా, హుజుర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి 46వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, చెన్నూర్ నుంచి గడ్డం వివేక్, అంథోల్ నుంచి దామోదర్ రాజనరసింహ గెలపొందారు.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై గెలిచారు. జక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు విజయం దక్కించుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి 5 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో.. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు.
అటు పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ అభ్యర్థి యశశ్విని రెడ్డిపై ఓడిపోయారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఓడిపోయారు. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇక ఈ ఫలితాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 26వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,582 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి కూడా విజయం సాధించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout