Revanth Reddy, Komati Reddy:కొడంగల్‌లో రేవంత్ రెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి ఘన విజయం

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అటు కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 56వేలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందగా, హుజుర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి 46వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, చెన్నూర్ నుంచి గడ్డం వివేక్, అంథోల్ నుంచి దామోదర్ రాజనరసింహ గెలపొందారు.

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై గెలిచారు. జక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు విజయం దక్కించుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి 5 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో.. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు.

అటు పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ అభ్యర్థి యశశ్విని రెడ్డిపై ఓడిపోయారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఓడిపోయారు. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇక ఈ ఫలితాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 26వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,582 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి కూడా విజయం సాధించారు.

More News

Revanth Reddy:రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్.. శుభాకాంక్షలు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Congress, Brs:దక్షిణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్.. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ హవా..

దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ కనబరుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా కొనసాగుతోంది.

Congress Party:తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ బోణీ.. రెండు చోట్ల విజయం..

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ..

BJP-Congress:మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం..

తెలంగాణతో పాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..

Bigg Boss Telugu 7 : అమర్‌‌కు ఊహించని సర్‌ప్రైజ్.. కానీ కండీషన్ , మరోసారి గౌతమ్ - శివాజీల గొడవ

బిగ్‌బాస్ తెలుగు 7 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వారం నిర్వహించిన టికెట్ టు ఫినాలే టాస్క్‌ల్లో విజయం సాధించి అర్జున్ అంబటి ఈ సీజన్‌లో