కోమటిరెడ్డి ఆలోచించు.. కేసీఆర్ ఆధారాలున్నాయ్!!

  • IndiaGlitz, [Saturday,July 27 2019]

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. అప్పుడెప్పుడో ఎన్నికల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన తాజాగా వచ్చిరాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటున్నారని కానీ.. ఈ రెండు పార్టీల బంధం తాచుపాము, జెర్రిపోతులాంటిదని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరాలనుకుంటున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, జి. వెంకటస్వామి ఒకసారి పునరాలోచించాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న కేవలం ఉత్తుత్తి ఫైటింగ్ మాత్రమేనన్నారు. గల్లీలో ఫైట్ చేస్తున్నట్లు నటిస్తూ ఢిల్లీలో ఈ రెండు పార్టీలు అలయ్ బలయ్ చేసుకుంటున్నాయన్నారు. కేసీఆర్, అమిత్ షా కలిసి నాటకం ఆడుతున్నారన్నారు.

నా దగ్గర ఆధారాలు ఉన్నాయ్..!!

కాగా.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ సహారా ప్రావిడెంట్‌ కేస్‌ వ్యవహారం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుఎక్కడివరకు వచ్చింది..? అసలు ఛార్జ్‌ షీట్‌లో కేసీఆర్‌ పేరు ఉందా లేదా? కిషన్‌ రెడ్డి, అమిత్‌షానే చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌పై ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం కేస్‌ ఎక్కడ వరకు వచ్చింది..? వ్యాపార సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేసారని, జగ్గారెడ్డి అక్రమ మనుషుల రవాణ కేసు పెట్టినప్పుడు.. అతను కేసీఆర్‌, హరీష్‌ రావు పేరు చెప్పినా ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న మురళీధర్‌ రావు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విచారణ ఎప్పుడు చేస్తారని నిలదీశారు..? నావి ఆరోపణలు కానే కాదని.. పక్కా ఆధారాలు ఉన్నాయి అని రేవంత్‌ రెడ్డి తేల్చిచెప్పారు. టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రజలు గుర్తించాలని రేవంత్ కోరారు. రేవంత్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

వైఎస్ జగన్‌ 'ట్రెండ్‌ సెట్టర్‌'గా మిగిలిపోతారు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్రెండ్‌ సెట్టర్‌గా చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర బాగు కోసం అనేక అభివృద్ధి

జనసేన పటిష్టానికి పవన్ చర్యలు.. నాగబాబుకు కీలక బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిని చవిచూశాక.. రానున్న ఎన్నికల్లో అయినా రాణించి పార్టీ సత్తా ఏంటో చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుం బిగించారు.

గూగుల్‌కే ఊహించని షాకిచ్చిన ‘లేడీ’..!!

గూగుల్ అంటే తెలియని వారుండరు.. దీన్ని ప్రతిరోజూ వాడకుండా ఉండలేరు కూడా. నిద్రలేచింది మొదలుకుని నిద్రపోయే వరకు ఈ గూగుల్‌తోనే అంతా పని. ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ మీద ఆధారపడే వారే.

కాల్ చేసి ఓటీపీ అడుగుతారు.. చెప్పారో అంతే సంగతులు!!

ఇప్పటి వరకూ ఫోన్ నంబర్‌కు పలుమార్లు కాల్స్ రావడం.. ఓటీపీ చెప్పడం ఇలా మోసపోయామని పోలీసులు ఫిర్యాదు చేయడం.. ఇలాంటి వార్తలు టీవీల్లో్, పేపర్లో పెద్ద ఎత్తున వినేవుంటాం.

పేరు మార్చుకుని సీఎంగా ‘యడియూరప్ప’ ప్రమాణం

కర్ణాటక కొత్త సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేశారు. కాగా మొదట శుక్రవారం నాడు ఇదివరకున్న యడ్యూరప్ప అనే పేరును ‘యడియూరప్ప’గా మార్చుకుని సీఎం పీఠమెక్కారు. రాజ్ భవన్‌లో గవర్నర్ వాజ్ భాయ్ వాలా..