రాత్రంతా స్క్రిప్ట్.. ఉదయం సురభి నాటకం: బీజేపీ, ఎంఐఎంపై రేవంత్ ఫైర్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ట్యాంక్‌బండ్ ఆక్రమణల నేపథ్యంలో పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. వాటిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చిన రెండు గంటల్లోపే దారుస్సలాంను కూల్చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. తాజాగా ఇరువురి వ్యాఖ్యలపై మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు.

ప్రతి రోజు సంజయ్, అరవింద్, అసద్, అక్బర్‌ల మధ్య.. ఫోన్‌ కాన్ఫరెన్స్‌ నడుస్తోందని.. దీనికి సంధానకర్త అమిత్‌ షా అని ఆరోపించారు. పీవీ, ఎన్టీఆర్‌లాంటి మహా నేతల పేర్లను.. బీజేపీ, ఎంఐఎం పార్టీలు తుచ్ఛ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలు అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్‌లను.. గౌరవించుకోలేని బీజేపీ.. పరాయి పార్టీ నేతలపై మాత్రం ప్రేమ ఒలకబోస్తోందన్నారు.

నిజంగా పీవీ, ఎన్టీఆర్‌లపై ప్రేమ ఉంటే వారికి భారతరత్న ఇవ్వాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 29న నగరానికి వస్తున్న అమిత్ షా ఆ మహానేతల ఘాట్లను సందర్శించి.. అక్కడే వీరివురికి భారతరత్నకు సంబంధించిన ప్రకటన చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంఐఎం, బీజేపీ నేతలు రాత్రి పూట అంతా కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకుని.. ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు.

More News

భారత్ తరుఫున ఆస్కార్‌కు ‘జల్లికట్టు’

తమిళనాడులోని సంప్రదాయ ఆట జల్లికట్టు ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఈ చిత్రం మన దేశం తరుఫున ఆస్కార్ 2021 బరిలో నిలవడం విశేషం.

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన జాబితా బయటకు వచ్చింది.

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా ఇక లేరు..

అర్జెంటైనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూశారు.

కలిసిపోయిన అఖిల్, మోనాల్..

పవర్ స్టార్ సాంగ్‌తో షో స్టార్ట్ అయ్యింది. సొహైల్ ఫేష్ వాష్ అనుకుని కోల్గేట్‌ను మొహానికి రాసుకున్నాడు.

కరోనా నియంత్రణకు నూతన మార్గదర్శకాల విడుదల...

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో దాని నియంత్రణకు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.