సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య నువ్వానేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జై తెలంగాణ అంటే ఉద్యమకారులను తుపాకీతో కాలుస్తా అని వెళ్లిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన ఆయన తీరును మీరంతా టీవీల్లో చూశారని.. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. చిప్పకూడు తిన్నా.. రేవంత్ రెడ్డికి సిగ్గు మాత్రం రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం 15 మంది పోటీ పడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అవతారని ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ గెలిస్తే కదా.. ఆయన సీఎం అయ్యేది అన్నారు.
ఇక కేసీఆర్ విమర్శలకు రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. పదవి పోతుందన్న భయంతో కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని అంటున్నారని.. ఇప్పుడు సూటిగా సవాల్ చేస్తున్నా.. గుర్తుపెట్టుకో బిడ్డా.. కాంగ్రెస్‌కు 80 సీట్ల కంటే ఎక్కువే రాబోతున్నాయి.. డిసెంబర్ 3వ తేదీన లెక్కపెట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడుతున్నారని.. బరాబర్ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు.
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను చూపించి తాము ఓట్లు అడుగుతున్నామని.. మేడిగడ్డను చూపించి కేసీఆర్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. మూతిమీదున్న మీసాలున్న మొనగాడివే అయితే ఈ సవాల్ అంగీకరించాలన్నారు. కవితను ఓడించినప్పటి నుంచి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇంతవరకు ప్రారంభించలేదని, పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments