Revanth Reddy: మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామనేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. "కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు.. అదేమైనా నువు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు.. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త" అంటూ హెచ్చరించారు.
రాష్ట్రంలో కారు పని అయిపోయిందని.. షెడ్డుకు పోయిందని.. ఇక ఎప్పటికీ బయటకు రాదని ఎద్దేశా చేశారు. వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పట్లో మెదక్ ఎంపీగా ఇందిరమ్మను గెలిపిస్తే ఆమె ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. 1999 నుంచి నేటి వరకు మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు కూడా ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ తేలేదని అన్నారు. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పరిశ్రమలు తెచ్చిందా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ రైతుల భూములు గుంజుకున్న దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి బీఆర్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి నేతలను ఓడించి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించామని, తమ ప్రభుత్వాన్ని పడగొడితే అడబిడ్డలు చూస్తూ ఊరుకోబోరన్నారు. కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించే ప్రజా పాలన కాంగ్రెస్ సొంతం అని తెలిపారు. రూ.22,500 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నాం.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. తాము ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తుంటే.. కడుపు మండిన మోదీ, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com