Revanth Reddy: కరెంట్‌పై చర్చకు సిద్ధమా..? సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లుతో కాక రేపుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్‌పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధంగా ఉన్నామని 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు కేసీఆర్ నిరూపిస్తే తాను పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డిలో నామినేషన్ ఉపసంహరించుకుంటానని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉందని.. ఈరోపు కేసీఆర్ లాగ్ బుక్‌లు తీసుకొని కామారెడ్డికి రావాలన్నారు.
ప్రపంచం మొత్తం ప్రస్తుతం కామారెడ్డి వైపే చూస్తుందని.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పడం కోసమే కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని తెలిపారు. కర్ణాటకలో గెలిచినట్లు.. తెలంగాణలోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కష్టాలు పడ్డామని కేసీఆర్‌కు వడ్డీతో సహా తిరిగి చెల్లించే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారం కరెంట్ చుట్టూనే తిరుగుతోంది. దీనినే ప్రధాన అంశంగా చేసుకొని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటున్నారు. ప్రతి సభలో కరెంటు కావాలా..? కాంగ్రెస్ కావాలా..? అంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లు ఖాయమంటూ చెబుతున్నారు. ఈ విమర్శలను ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. ఇప్పుడు ఏకంగా కరెంట్‌పై చర్చకు రావాలంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments