Revanth Reddy:బ్రేకింగ్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ కొత్త సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తూ ఏఐసీసీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి సోమవారం సీఎల్పీ భేటీ జరిగిందని.. ఇందులోఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలిపారు. దీంతో ఈనెల 7న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. సీనియర్లందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరు కలిసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను నెరవేరుస్తారని ఆయన తెలిపారు.
మొత్తానికి రెండు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీఎల్పీ భేటీలో 64 మంది ఎమ్మెల్యేల్లో 42 మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపారు. దీంతో అధిష్టానం పెద్దలు రేవంత్ వైపే మొగ్గుచూపారు. మరోవైపు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు రావడంతో ఆయన హస్తిన బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గం కూర్పుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీ వెళ్లే ముందు రేవంత్ రెడ్డి తుఫాన్ ప్రభావంపై ట్వీట్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో తుఫాన్ ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి" అని ఆదేశాలు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout