కాంగ్రెస్ అధిష్టానంపై రేవంత్ గుర్రు!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు శంషాబాద్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే. ఈ భారీ బహిరంగ సభకు ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరు కాకపోవడం గమనార్హం. ఆయన హాజరుకాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఆయన ఎందుకు హాజరుకాలేదు..? హైదరాబాద్‌లో ఉండి కూడా ఆయన హాజరుకాకపోవడానికి కారణాలేంటి..? అధిష్టానంపై రేవంత్ సీరియస్‌గా ఉన్నారా..? ఎంపీ టికెట్‌కే అధిష్టానం నో చెప్పిందని అధిష్టానంపై ఆయన అసంతృప్తితో ఉన్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టడంతో కోలుకోలేని దెబ్బ తగిలిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల రూపంలో ఆ గాయాలను మాన్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్నికల ముందు పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలంతా సడన్ షాకిస్తూ కారెక్కేస్తుండటంతో అధిష్టానంలో కలవరపాటు మొదలైంది. అయినా సరే ఈ ఎన్నికల్లో సత్తా ఏంటో చూపించడానికి టి. కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో కొందరు పార్టీకి గుడ్‌బై చెప్పడం.. ఉన్న నేతలు కూడా అలకబూనడంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పి వచ్చిపడింది.
శనివారం రోజున జరిగిన శంషాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేదికను అలరించారు. ఈ సభలో.. స్వాగత ఉపన్యాసంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతలను ఆహ్వానిస్తున్న క్రమంలో రేవంత్ పేరు కూడా ప్రస్తావించారు. రేవంత్ గైర్హజరు కాకపోవడంతో అందరూ రేవంత్ ఎక్కడ.. ? అని స్టేజ్‌పై చూసుకున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు. ఆయన హాజరవ్వకపోవడంతో నేతల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన నాటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న రేవంత్.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. మరోవైపు ఆయన మామ, సీనియర్ నేత జైపాల్ రెడ్డి సైతం టికెట్ కోసం పోటీపడుతున్నారు.
మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాలని రేవంత్ భావిస్తుండగా అధిష్టానం మాత్రం కుదరదని చెప్పిందని సమాచారం. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన మీడియామీట్‌లకు.. ముఖ్యంగా కాంగ్రెస్ నిర్వహించిన సభలకు వెళ్లకూడదని భావించినట్లు తెలుస్తోంది. అందుకే అప్పుడెప్పుడో ఓటుకు నోటు కేసు విచారణ టైమ్‌లో మీడియాలో కనిపించిన రేవంత్ ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు.!. కాంగ్రెస్ అధిష్టానం తన మాట ఖాతరు చేయకపోవడంతో ఒకానొక సందర్భంలో టీడీపీ నుంచి బయటికి ఎందుకొచ్చానా..? అని బాధగా ఉందని.. కుటుంబీకులు, సన్నిహితులతో చెప్పారట. మొత్తానికి చూస్తే రేవంత్ అసంతృప్తితో రగిలిపోతున్నారని దీన్ని బట్టి అర్థం చేస్కోవచ్చు. ఈ విషయాన్ని గ్రహించి రేవంత్ శాంతపరుస్తారో లేకుంటే వదులుకుంటారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout