రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తిట్ల పురాణం సోషల్ మీడియాలో వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితేకాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా రాజగోపాల్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరనుండడంతో వీరిద్దరు తిట్టుకున్న తిట్ల పురాణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజగోపాల్ రెడ్డి.. ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు..
మునుగోడు ఉపఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక కాంట్రాక్టర్, వాడి పేరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ కమీనే కుత్తేగాడు.. అమిత్ షా దగ్గరి నుంచి కాంట్రాక్టులకు కక్కుర్తి పడి ఒప్పందం చేసుకున్నాడు. వీడసలు మనిషేనా. అన్నం తినెటోడు.. అమ్మ మీద ప్రేమ ఉన్నోడు ఎవడైనా.. ఇంత దుర్మార్గానికి పాల్పడతాడా..?" అంటూ బహిరంగ సభా వేదికగా రాజగోపాల్ రెడ్డిపై రెచ్చిపోయారు.
రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మేయిలర్..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. "రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మేయిలర్. రేవంత్ కాళ్ల దగ్గర పనిచేయటం కంటే.. రాజకీయాలు వదిలేయటం బెటర్. ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికిన వ్యక్తి నాయకత్వంలో పని చేయటం కంటే అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. మిగతా.. కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయంపై ఆలోచించి.. బీజేపీలో చేరండి" అంటూ విమర్శించారు.
రాజకీయ నాయకులకు విలువలు ఉండవా..?
అయితే ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్లోకి రాజగోపాల్ రెడ్డి వెళ్లనుండటం.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులకు విలువలు ఉండవా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివే కామన్ అంటూ మరికొంత మంది విమర్శిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments