Revanth Reddy-KTR:అసెంబ్లీలో ఢీ అంటే ఢీ.. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. గవర్నర్‌కు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బలపరిచారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా, అసత్యంగా ఉందని ఆరోపించారు. ఆయన మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డు తగిలారు. 2014కు ముందు అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పారు. ప్రసంగం మొదలు పెట్టడమే కేటీఆర్ దాడి చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదని.. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు.
అనంతరం కేటీఆర్ ప్రసంగం కొనసాగిస్తూ గత 10 ఏళ్ల పాలన గుర్తుచేస్తున్న వారికి అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి చెప్పాలని కేటీఆర్ చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం జరిగిన అరాచకాలను కూడా గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణకు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచిన కొడుకు కేసీఆర్ అంటూ అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ చెప్పినట్టు బానిసకొక బానిస అన్నట్టు తెలంగాణను పీడించిన వాళ్లు పోయినా వారిని తలుచుకునే వాళ్లు మాత్రం ఇక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. తాము 39 మంది, వాళ్లు 65 మంది ఉన్నారని మిడిసి పడుతున్నారని ఇది మంచిది కాదన్నారు. వాళ్లకు తమకు మధ్య తేడా 1.85 ఓటు మాత్రమే అన్నారు. దీనికే ఈ మాత్రం మిడిసిపాటు వద్దని పేర్కొన్నారు.
కేటీఆర్‌కు కౌంటర్‌గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం అవగాహన కాదు అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా విలువ ఉంటుందని... 51 శాతానికి 100 శాతం వాల్యూ ఉంటుందని అభిప్రాయపడ్డారు. 51 శాతం ఉన్న వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని... 49 శాతం ఉన్న వాళ్లు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం చేసే నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారన్నారు. ఆ స్పిరిట్‌ను తీసుకోకుండా వాళ్లు 65 మంది ఉన్నారు... మేము 39 మంది ఉన్నాం మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు వచ్చిన కొట్లాడతామంటే ఇక్కడ కుదరదన్నారు.
గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ, షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఆ తర్వాత కేసీఆర్‌కు కార్మిక శాఖ మంత్రిగా చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన హరీష్‌ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించిందని కాంగ్రెస్ పార్టీ అన్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో కొట్లాడింది పీజేఆర్ మాత్రమే అన్నారు.
అనంతరం హరీశ్ రావు కలుగజేసుకుని సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని తెలిపారు. అప్పుడు పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని తాము కొట్లాడామని.. అప్పట్లో ఒక్క పీజేఆర్ తప్ప మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరూ పోతిరెడ్డిపాడుపై మాట్లాడలేదన్నారు. తాము పొత్తు పెట్టుకోవడం వల్లే నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. మొత్తానికి అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com