BiggBoss: కృష్ణ మరణంతో షాక్‌లో ఇంటి సభ్యులు.. రెండవసారి కెప్టెన్‌గా రేవంత్
Send us your feedback to audioarticles@vaarta.com
గొడవలు, వివాదాలతో సాగిపోతున్న బిగ్‌బాస్ హౌస్ సభ్యులకు బయట ఏం జరుగుతుందో తెలియదు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం వుండదు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ దిగ్గజం, సూపర్‌స్టార్ కృష్ణ మరణించిన విషయం వాళ్లకి ఆలస్యంగా తెలిసింది. ఎపిసోడ్ ప్రారంభమైన వెంటనే కృష్ణ గారు మరణించిన విషయాన్ని బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు తెలియజేశారు. దీంతో కంటెస్టెంట్స్ షాక్‌కు గురయ్యారు. సూపర్‌స్టార్‌కు సంతాపక సూచికంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం యథావిధిగా టాస్క్ స్టార్ట్ చేశారు.
ఫైనల్‌గా అన్ని రౌండ్స్ పూర్తయ్యే సరికి కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనయాలు అర్హత సాధించారు. వీరికి ‘‘కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్’’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. దీనిలో భాగంగా గార్డెన్ ఏరియాలో ఐదుగురు పోటీదారులు ఐదు గోల్ పోస్టులు వుంటాయి. మధ్యలో ఒక బాల్ వుంటుంది. బంతికి కాళ్లు, చేతులతో ఇతరుల గోల్ పోస్ట్స్‌లో వేయాలి, బంతి ఎవరి గోల్ పోస్ట్ మీదుగా వెళ్తుందో వారు పోటీలో నుంచి తప్పుకుంటారు. బంతి తమ గోల్ పోస్ట్ మీదకు రాకుండా కంటెస్టెంట్స్ అడ్డుకోవాలి. అసలే ఫిజికల్ గేమ్ కావడంతో మన రేవంత్ ఎప్పటిలాగే రెచ్చిపోయాడు. ఎవరు ఎమనుకుంటే నాకేంటీ నేను ఇలాగే ఆడతానంటూ దూసుకెళ్లాడు.
టాస్క్ ప్రారంభమైన తర్వాత వరుసగా రోహిత్, ఆదిరెడ్డి, ఇనయాలు ఔటవ్వగా.. చివరికి రేవంత్, శ్రీహాన్ మాత్రమే వుంటారు. రేవంత్ ధాటికి శ్రీహాన్ తట్టుకోలేక ఔట్ అవుతాడు. దీంతో రేవంత్ ఈ వారం కెప్టెన్‌గా గెలుస్తాడు. అనంతరం ఇంటి సభ్యులు రేవంత్‌కి అభినందనలు తెలియజేశారు. అయితే రెండవసారి కెప్టెన్ కావడంతో రేవంత్ ఎమోషనల్ అవుతాడు.
ఇకపోతే.. ఇనయా గురించి ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బిగ్‌బాస్ 6 తెలుగు ప్రారంభమైన నాటి నుంచి ఇంట్లోనే వున్నప్పటికీ ఆమెకు కెప్టెన్ అయ్యే అవకాశం రాలేదు. ప్రతీసారి కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనడం వెనక్కి తిరిగి రావడం షరా మామూలే అన్నట్లుగా తయారైంది ఆమె పరిస్ధితి. కొన్ని సార్లు ఫిజికల్ గేమ్స్ ఆడలేక, ఇంకొన్ని సార్లు గీతూ లాంటి వాళ్ల మైండ్ గేమ్ వల్ల ఇనయాకు కెప్టెన్సీ దక్కలేదు. తాజాగా ఈవారం కూడా ఇనయాను దురదృష్టం వెంటాడింది. రేవంత్ ఆమెను గట్టిగా టార్గెట్ చేసి.. బంతిని ఆమె రెండు స్టాండ్ల నుంచి బయటకి వేశాడు. అతనిని ఎదుర్కోవడానికి ఇనయా చాలా కష్టపడింది. కానీ రేవంత్ బలం, దూకుడు ముందు నిలబడలేకపోయింది. ఈ తతంగం జరుగుతూనే వుండగా ఆమె ఒకప్పటి ఫ్రెండ్ శ్రీహాన్ చూస్తూ వుండిపోయాడు తప్పించి.. ఎలాంటి సాయం చేయలేదు. టాస్క్‌లో ఓడిపోవడంతో ఇనయా మరోసారి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదిరెడ్డి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. నువ్వు అంతసేపు అతనిని ఎదుర్కోవడమే చాలా పెద్ద విషయం అని చెబుతాడు.
ఇక ఈ రోజు ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది. రేవంత్ - ఫైమా ఫైట్ గురించే. నీలాగా ఎవరో ఒకరి సాయం తీసుకుని ఆడటం నాకు రాదంటూ రేవంత్ ఫైమాను కామెంట్ చేశాడు. మధ్యలో ఆదిరెడ్డి కలగజేసుకుంటూ.. బ్రెయిన్ వుండి మాట్లాడుతున్నావా అంటూ ఫైరయ్యాడు. నువ్వు నాతో, ఇనయాతో, గేమ్‌లో శ్రీహాన్‌తో కలిసి ఆడలేదా అంటూ కౌంటరిచ్చాడు. దీంతో ఏం మాట్లాడలేక సైలెంట్ అయ్యాడు రేవంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments