'రిటర్న్ గిఫ్ట్' ఒకరికి కాదు.. ఇద్దరికి!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎక్కడ చూసినా వినపడే ఒకే ఒక్కపదం ‘రిటర్న్ గిఫ్ట్’. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ టైమ్‌లో ఈ మాట అన్నాడో కానీ అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇది ట్రెండింగ్ అవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో వేలుపెట్టిన చంద్రబాబుకు కచ్చితంగా మేం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్‌తో పాటు కేటీఆర్ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత శనివారం రోజున జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రిటర్న్ గిఫ్ట్ ’వ్యవహారంపై ఫస్ట్ టైమ్ కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రిటర్న్ గిఫ్ట్ ఒకరికి కాదు.. ఇద్దరికి..
"రిటర్న్ గిఫ్ట్ విషయంలో చంద్రబాబుకు కంగారొద్దు. ఇవ్వాల్సిన టైంలో కేసీఆర్ కచ్చితంగా ఇస్తారు. బాబుతో పాటు ఏబీఎన్- ఆంధ్రజ్యోతికి కూడా కంగారు పడొద్దు. ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. కేసీఆర్‌ని చంద్రబాబు చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బాబు విమర్శలకు కేసీఆర్ త్వరలోనే స్పందిస్తారు. మాకు ఎవరితోనూ యుద్ధం లేదు. తెలంగాణను దెబ్బతీసే వారితోనే మా యుద్ధం" అని కవిత చెప్పుకొచ్చారు.
నేను ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు!
" కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయి. గత ఎన్నికల్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. సీఎం కేసీఆర్ వల్లే జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. రైతుల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు నామినేషన్లు వేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమాతో రైతులకు అండగా ఉన్నాం. నిజమైన రైతులు కేసీఆర్ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారు. పసుపు బోర్డు కోసం నేను ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. గల్లీలో మీ సేవకులుగా ఉంటాం.. ఢిల్లీలో సైనికులుగా ఉంటాం" అని కవిత పేర్కొన్నారు.
సో.. మొత్తానికి చూస్తే అటు చంద్రబాబుకు ఇటు ఏబీఎన్‌కు ఇద్దరికీ రిటర్న్ గిఫ్ట్‌లు ఉంటాయని కవిత పరోక్షంగా చెప్పారన్న మాట. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో.. ఈ ఇద్దరికీ అసలు కేసీఆర్ ఏం ప్లాన్ చేశారో..? అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout