ఆనందయ్య మందుతో కోలుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
నెల్లూరు: జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి. గతంలో ఆనందయ్య మందుతో కోలుకున్నానని కోటయ్య చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో కోటయ్య వీడియోలు హల్‌చల్ చేశాయి. అయితే ఆనందయ్య వైద్యాన్ని తప్పుగా నిరూపించడం కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే కోటయ్యను ఇంటర్వ్యూ చేసి ఇబ్బందికర ప్రశ్నలు వేసిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. కోటయ్య ఆరోగ్యాన్ని హైలైట్ చేస్తూ ఆనందయ్య మందుకు వ్యతిరేక ప్రచారాన్ని సైతం నిర్వహించారు.
ఇదీ చదవండి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా కొవిడ్ వైరస్‌ను చూడాలనుకుంటున్నారా?
కాగా.. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య తాను ఏ పరిస్థితుల్లో కృష్ణపట్నం వచ్చారో అప్పట్లో మీడియాకు వివరించారు. ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్నానని.. ఇంకా రెండు నిముషాలు ఆగితే, ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. దీంతో వెంటనే మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నానని, ఈ మందు చాలా అద్భుతమని కృష్ణపట్నం మందు వేసుకున్న సదరు వ్యక్తి తెలిపారు. అనంతరం కూడా ఆనందయ్య మందు విషయమై కోటయ్యతో పాటు ఆయన కూతురు సైతం పాజిటివ్ రిపోర్ట్‌నే ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com