'2.0' గురించి రసూల్ పూకొట్టి వివరణ..
Send us your feedback to audioarticles@vaarta.com
2.0లో వాడిన 4డీ గురించి రసూల్ పూకొట్టి వివరించారు. శనివారం చెన్నైలో జరిగిన '2.0' ట్రైలర్ లాంచ్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకొట్టి మాట్లాడుతూ "శంకర్ నాకు ఫోన్ చేసి స్టోరీని నెరేట్ చేశారు. ఫ్లోర్ స్పేస్ సౌండ్ స్క్రీన్ నుంచి ఆడియన్స్ వరకు వెళ్లడాన్ని ఆయన వివరించారు. అదంతా విని నాకు వెన్నులో చలి మొదలైంది. ప్రపంచసినిమాలో ఇలాంటిది చేయడం ఇదే తొలిసారి. రెండేళ్లు నేను, శంకర్ కలిసి పనిచేసి దీన్ని రియాలిటీకి తీసుకొచ్చాం.
చాలా మంది మాకు సాయం చేశారు. సాఫ్ట్ వేర్ డెవలపర్స్ సాయం మర్చిపోలేం. ఎందరో మమ్మల్ని అలోగరిథమ్ ఆఫ్ సినిమా ప్రొజెక్షన్ని రీరైట్ చేయడానికి అనుమతించారు. సృజనకారుల ఆలోచనలను అంతే గొప్పగా అర్థం చేసుకునే నిర్మాత చాలా ముఖ్యం. నిర్మాతకు ధన్యవాదాలు. ఇండియన్ సినిమా స్టాల్వార్ట్స్ ఎందరో ఇక్కడున్నారు.
ధ్వని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక విషయానికి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష సాక్ష్యులు. కొత్త ఫార్మాట్‌కి సాక్ష్యులు. త్రీడీ సౌండ్‌లో ఉన్న అన్నిటికన్నా అడ్వాన్స్డ్ లెవల్ ఇది. అలోగరిథమ్స్ మార్చి దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చాం. ఈ ఫార్మాట్ వల్ల మూవీ మరింతగా ఆడియన్స్ మైండ్‌కి చేరుతుంది. ఇంత గొప్ప అచీవ్మెంట్లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా టీమ్‌కి, లైకా టెక్నికల్ టీమ్‌కి ధన్యవాదాలు. ఇది తలైవర్ సినిమా" అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout