పవన్ పిలిచి అవమానించారు.. అందుకే రాజీనామా!
- IndiaGlitz, [Saturday,March 23 2019]
ఎన్నికల ముందు జనసేనకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి బయటికొచ్చేయగా తాజాగా మరో కీలకనేత జనసేనకు గుడ్‌బై చెప్పారు. మార్చి 18న మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. దాస్‌కు పవన్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఆయన పార్టీలో చేరి పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అసలేం జరిగిందో దాస్ మాటల్లోనే...
మార్చి 18వ తేదిన జనసేన పార్టీలో చేరాను. పామర్రు నుంచి మాత్రమే జనసేన నుంచి పోటీ చేస్తానని పవన్‌కు చెప్పాను. బీఫాం ఇవ్వకుడా డిస్ట్రబెన్స్ చేసారు. సీనియర్ నాయకుడునని కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. పామర్రు సీటు బీఎస్పీకి ఇచ్చాం వారితో మాట్లాడుకోవాలని పవన్ చెప్పడంతో తీవ్ర మనస్థాపనకు గురిచేసింది. నేను చేరింది జనసేన సీటు కోసం.. కానీ బీఎస్పీతో మాట్లాడు కోవటం ఏమిటో అర్థం కావట్లేదు. పామర్రు సీటు ఇవ్వాలంటే బీఎస్పీలో చేరమని ఆ పార్టీ నాయకులు చెప్పారు.
అంతేకాదు శుక్రవారం రోజు పార్టీ తరఫున బీఫామ్ ఇస్తామని పిలిపించి ఇవ్వకుండా అనమాన పరిచారు. ప్రజలకోసం పార్టీని స్థాపించారా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ స్థాపించారా? అనేది నాకు అర్థం కావట్లేదు. జనసేన పార్టీలో నన్ను అవమానకరంగా ట్రీట్ చేశారు. నాకు సీటు ఇవ్వకపోవటంలో టీడీపీ హస్తం ఉన్నట్లు నేను బావిస్తున్నాను. సిట్టింగల్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను గెలిపించేదుకు నాకు సీటు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అందుకే జనసేనకు రాజీనామా చేసి నుంచి బయటకు వచ్చాను అని దాస్ మీడియా ముందు ఆవేదనకు లోనయ్యారు. కాగా జనసేనకు రాజీనామా చేసిన దాస్ ఏ పార్టీలో చేరతారన్నది ఇంతవరకూ అనే విషయం అనుచరులు, ముఖ్య కార్తలతో చర్చించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని దాస్ తెలిపారు.