నువ్.. మొనగాడు, మగాడివైతే రాజీనామా చెయ్..!

  • IndiaGlitz, [Monday,July 22 2019]

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా రచ్చ ముదురుతోంది. ఇప్పటి వరకూ ప్రతిపక్ష టీడీపీలోనే ఎంపీ కేశినేని నాని- ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నెలకొన్న విషయం విదితమే. అయితే వీరిద్దరి ట్వీట్ వార్ ముగిసే సరికి.. కేశినేని నానిపై పోటీచేసి ఓడిన ప్రముఖ నిర్మాత పీవీపీ వరప్రసాద్ ఎంటరయ్యారు. దీంతో కేశినేని వర్సెస్ పీవీపీగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే వీరిద్దరూ పలుమార్లు ట్వీట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.

40 ఓట్లు తెచ్చుకుని మాట్లాడు బయ్యా!  

అయితే తాజాగా కేశినేని నానిపై పీవీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని మొనగాడే అయితే.. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, 40 ఓట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. అంతటితో ఆగని ఆయన వరుస ట్వీట్స్ చేశారు. నాలుగు ఓట్లు తెచ్చుకోలేవు అని అనడం కాదు. మొనగాడివి, మొలతాడు కట్టిన మగాడివి అయితే, రాజీనామా చేసి, ఇండిపెండెంట్ గా 40 ఓట్లు తెచ్చుకుని మాట్లాడు బయ్యా!. పాపం పార్టీ బండి మూల పడిందని.. దాని తరపున పోటీ చేసి డబ్బా కొట్టుకున్నా 2 లక్షల మెజారిటీ కొంచెంలో మిస్ అయ్యానే అని చాలా ఫీల్ అవుతున్నావంటా! అదే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే.. 4 లక్షల మెజారిటీ కొడతావేమో!! నీ బస్సులన్నీ బ్రాండ్ న్యూ కదా! అని కేశినేనిపై పీవీపీ షాకింగ్ ట్వీట్స్ చేశారు. అయితే తనను విమర్శిస్తే చాలు ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయే కేశినేని.. పీవీపీ తాజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.