ఎలాంటి పాత్ర చేయ‌డానికైనా నేను రెడీ - రేష్మి

  • IndiaGlitz, [Wednesday,March 02 2016]

జ‌బ‌ర్థ‌స్త్ పొగ్రామ్ తో బాగా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ రేష్మి. ఇప్పుడు హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతూ రేష్మి న‌టించిన చిత్రం గుంటూరు టాకీస్. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ చిత్రాన్ని ఈనెల 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రేష్మి ఇంట‌ర్ వ్యూ మీకోసం...

ప్ర‌స్ధానం, క‌రెంట్, బిందాస్ చిత్రాలో న‌టించారు. ఇప్ప‌డు చాలా గ్యాప్ త‌రువాత గుంటూర్ టాకీస్ లో న‌టించారు క‌దా..మీకు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవ‌చ్చా..?

సెకండ్ ఇన్నింగ్ కాదండి...ఇది నా థ‌ర్డ్ ఇన్నింగ్. 2002లో థ్యాంక్స్ అనే సినిమా చేసాను. ఇందులో వినీత్, శ్రీరామ్ ల‌తో క‌ల‌సి న‌టించాను. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ సినిమా స‌రిగా ఆడ‌లేదు. ఆత‌ర్వాత కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉన్నాను. మా టీవీలో ఓ సీరియ‌ల్ లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇక అప్ప‌టి నుంచి బిందాస్, క‌రెంట్...ఇలా సినిమాల్లో చేసాను. అయితే నేను అనుకున్న‌టి వంటి రోల్స్ రావ‌డం లేద‌ని సినిమాల్లో న‌టించ‌డం మానేసాను. అనుకోకుండా జ‌బ‌ర్ధ‌స్త్ లో అవ‌కాశం వ‌చ్చింది. ఆత‌ర్వాత ఈ సినిమాలో అవ‌కాశం రావ‌డంతో మ‌ళ్లీ వెండితెర‌కు వ‌చ్చాను.

జ‌బ‌ర్థ‌స్ట్ మీ లైఫ్ ని ఛేంజ్ చేసింది అనుకుంటున్నారా..?

అవును...జ‌బ‌ర్ధ‌స్త్ నా లైఫ్ నే మార్చేసింది. ఈ సంద‌ర్భంగా మ‌ల్లెమాల ప్రొడ‌క్ష‌న్ & జ‌బ‌ర్ధ‌స్త్ టీమ్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. జ‌బ‌ర్థ‌స్త్ వ‌ల్లే గుంటూరు టాకీస్ లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

గుంటూరు టాకీస్ ప్ర‌త్యేక‌త ఏమిటి..?

త‌క్కువ బ‌డ్జెట్ తో క్వాలిటీ అవుట్ పుట్ తో గుంటూరు టాకీస్ సినిమా వ‌స్తుంది. ఇలాంటి సినిమాల‌ని ఆద‌రిస్తే పెద్ద ప్రొడ్యూస‌ర్స్ కూడా ఇలాంటి సినిమాల‌ను తీయ‌డానికి ముందుకు వ‌స్తారు. మ‌రెన్నో కొత్త‌క‌థ‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇండ‌స్ట్రీని మార్చేలా కొత్త‌క‌థ‌తో వ‌స్తున్నగుంటూరు టాకీస్ లో నేను ఓ బాగం అయినందుకు గ‌ర్వంగా ఉంది.

ఈ సినిమాలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

నా ఇమేజ్ కి భిన్నంగా గ్రామీణ యువ‌తిగా న‌టించాను. సువ‌ర్ణ అనే ఈ పాత్ర చేయ‌డం నాకు ఓ ఛాలెంజ్. నా పాత్రకు పూర్తి న్యాయం చేసాను అనుకుంటున్నాను. డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్ ఎలా చెబితే అలా చేసాను.

ఈ సినిమా స్ల‌మ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది క‌దా...మ‌రి హాట్ సాంగ్ పెట్ట‌డానికి కార‌ణం ఏమిటి..?

నిజ‌మే...ఇది స్ల‌మ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే క‌థ‌. 1990 టైమ్ లో ఫ్రెండ్స్ , ల‌వ‌ర్స్ మాట్లాడుకోవ‌డానికి ఫోన్స్ ఉండేవు కాదు క‌దా..అప్పుడు ల‌వ‌ర్స్ కాగితం మీద రాసి వాళ్ల‌కి ఏదోలా చేరేలా సందేశం పంప‌డం చేసేవారు. అదంతా ఇందులో చూపించాం. అయితే క‌ల‌సుకోవ‌డానికి కూడా ఇబ్బంది గా ఫీల‌య్యే జంట‌కి ఒక్క‌సారిగా ఫ్రీడ‌మ్ దొరికితే ఎలా ఉంటుది అనేది ఆ సాంగ్ లో చూపించాం.

ఐటం సాంగ్ చేయ‌డానికి మీరు రెడీనా..?

గుడ్ కొరియోగ్రాఫ‌ర్...గుడ్ సాంగ్ అయితే ఐటం సాంగ్ చేయ‌డానికి రెడీ. రింగ రింగా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మ‌నంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆ టైపు ఐటం సాంగ్స్ కాస్త త‌గ్గాయ‌నే చెప్పాలి. అలాగే మామూలు సాంగ్ కంటే ఐటం సాంగ్ బాగా పాపుల‌ర్ అవుతున్నాయి. ఎప్ప‌టికీ గుర్తుంటున్నాయి. అలాంటి ఐటం సాంగ్స్ చేయ‌డానికి నేను రెడీ.

ప‌ర్ ఫార్మెన్స్ రోల్ - ఐటం సాంగ్ రెండింటిలో మీ ప్రాధాన్య‌త దేనికి..?

రెండింటికి..(న‌వ్వుతూ..)

సిస్ట‌ర్ రోల్స్ వ‌స్తే చేస్తారా..?

సిస్ట‌ర్ రోల్స్ చేస్తాను...ఫ్రెండ్స్ రోల్ చేస్తాను..అంతే కాదు...క్యారెక్ట‌ర్ కి సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి క్యారెక్ట‌ర్ అయినా చేస్తాను.

బుల్లితెర - వెండితెర రెండింటిలో మీ ఇంపార్టెన్స్ దేనికి..?

బుల్లితెర, వెండితెర రెండింటిలో చేస్తాను. సినిమాల్లోకి వ‌చ్చినంత మాత్రానా బుల్లితెర‌ను వ‌దిలేస్తాను అనుకోవ‌ద్దు. ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కార‌ణం టెలివిజ‌న్. అందుచేత వెండితెర‌ను వ‌దిలేయ‌డం అనేది ఉండ‌దు. ఇప్ప‌టికీ నా ప్రాధాన్య‌త టెలివిజ‌న్ కే.

More News

నిజంగానే డిఫ‌రెంట్ మూవీ శౌర్య - మ‌నోజ్

మంచు మ‌నోజ్ - రెజీనా జంట‌గా ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించిన చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శివ‌కుమార్ నిర్మించారు. థ్రిల్లింగ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన శౌర్య ఈనెల  4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

బొలివియాకు బన్ని...

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం 'సరైనోడు'.

'బాహుబలి2' రిలీజ్ డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళిల ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి ది బిగినింగ్ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే.

చైతు టైటిల్ చాలా ఇష్టం అంటున్ననాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

రోహిత్ సావిత్రికి ముఖ్య అతిథిగా బాలయ్య...

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో.ప్రతి స్క్రిప్ట్ ను విలక్షణంగా ఎంచుకుంటూ ఇటు ప్రేక్షకులు,ఇండస్ట్రీ వర్గాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో నారారోహిత్