ఎలాంటి పాత్ర చేయడానికైనా నేను రెడీ - రేష్మి
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్థస్త్ పొగ్రామ్ తో బాగా పాపులర్ అయిన యాంకర్ రేష్మి. ఇప్పుడు హీరోయిన్ గా పరిచయం అవుతూ రేష్మి నటించిన చిత్రం గుంటూరు టాకీస్. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ చిత్రాన్ని ఈనెల 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రేష్మి ఇంటర్ వ్యూ మీకోసం...
ప్రస్ధానం, కరెంట్, బిందాస్ చిత్రాలో నటించారు. ఇప్పడు చాలా గ్యాప్ తరువాత గుంటూర్ టాకీస్ లో నటించారు కదా..మీకు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా..?
సెకండ్ ఇన్నింగ్ కాదండి...ఇది నా థర్డ్ ఇన్నింగ్. 2002లో థ్యాంక్స్ అనే సినిమా చేసాను. ఇందులో వినీత్, శ్రీరామ్ లతో కలసి నటించాను. కొన్ని కారణాల వలన ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆతర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాను. మా టీవీలో ఓ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఇక అప్పటి నుంచి బిందాస్, కరెంట్...ఇలా సినిమాల్లో చేసాను. అయితే నేను అనుకున్నటి వంటి రోల్స్ రావడం లేదని సినిమాల్లో నటించడం మానేసాను. అనుకోకుండా జబర్ధస్త్ లో అవకాశం వచ్చింది. ఆతర్వాత ఈ సినిమాలో అవకాశం రావడంతో మళ్లీ వెండితెరకు వచ్చాను.
జబర్థస్ట్ మీ లైఫ్ ని ఛేంజ్ చేసింది అనుకుంటున్నారా..?
అవును...జబర్ధస్త్ నా లైఫ్ నే మార్చేసింది. ఈ సందర్భంగా మల్లెమాల ప్రొడక్షన్ & జబర్ధస్త్ టీమ్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. జబర్థస్త్ వల్లే గుంటూరు టాకీస్ లో నటించే అవకాశం వచ్చింది.
గుంటూరు టాకీస్ ప్రత్యేకత ఏమిటి..?
తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ అవుట్ పుట్ తో గుంటూరు టాకీస్ సినిమా వస్తుంది. ఇలాంటి సినిమాలని ఆదరిస్తే పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి సినిమాలను తీయడానికి ముందుకు వస్తారు. మరెన్నో కొత్తకథలు బయటకు వస్తాయి. ఇండస్ట్రీని మార్చేలా కొత్తకథతో వస్తున్నగుంటూరు టాకీస్ లో నేను ఓ బాగం అయినందుకు గర్వంగా ఉంది.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా ఇమేజ్ కి భిన్నంగా గ్రామీణ యువతిగా నటించాను. సువర్ణ అనే ఈ పాత్ర చేయడం నాకు ఓ ఛాలెంజ్. నా పాత్రకు పూర్తి న్యాయం చేసాను అనుకుంటున్నాను. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఎలా చెబితే అలా చేసాను.
ఈ సినిమా స్లమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కదా...మరి హాట్ సాంగ్ పెట్టడానికి కారణం ఏమిటి..?
నిజమే...ఇది స్లమ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. 1990 టైమ్ లో ఫ్రెండ్స్ , లవర్స్ మాట్లాడుకోవడానికి ఫోన్స్ ఉండేవు కాదు కదా..అప్పుడు లవర్స్ కాగితం మీద రాసి వాళ్లకి ఏదోలా చేరేలా సందేశం పంపడం చేసేవారు. అదంతా ఇందులో చూపించాం. అయితే కలసుకోవడానికి కూడా ఇబ్బంది గా ఫీలయ్యే జంటకి ఒక్కసారిగా ఫ్రీడమ్ దొరికితే ఎలా ఉంటుది అనేది ఆ సాంగ్ లో చూపించాం.
ఐటం సాంగ్ చేయడానికి మీరు రెడీనా..?
గుడ్ కొరియోగ్రాఫర్...గుడ్ సాంగ్ అయితే ఐటం సాంగ్ చేయడానికి రెడీ. రింగ రింగా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ టైపు ఐటం సాంగ్స్ కాస్త తగ్గాయనే చెప్పాలి. అలాగే మామూలు సాంగ్ కంటే ఐటం సాంగ్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఎప్పటికీ గుర్తుంటున్నాయి. అలాంటి ఐటం సాంగ్స్ చేయడానికి నేను రెడీ.
పర్ ఫార్మెన్స్ రోల్ - ఐటం సాంగ్ రెండింటిలో మీ ప్రాధాన్యత దేనికి..?
రెండింటికి..(నవ్వుతూ..)
సిస్టర్ రోల్స్ వస్తే చేస్తారా..?
సిస్టర్ రోల్స్ చేస్తాను...ఫ్రెండ్స్ రోల్ చేస్తాను..అంతే కాదు...క్యారెక్టర్ కి సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను.
బుల్లితెర - వెండితెర రెండింటిలో మీ ఇంపార్టెన్స్ దేనికి..?
బుల్లితెర, వెండితెర రెండింటిలో చేస్తాను. సినిమాల్లోకి వచ్చినంత మాత్రానా బుల్లితెరను వదిలేస్తాను అనుకోవద్దు. ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం టెలివిజన్. అందుచేత వెండితెరను వదిలేయడం అనేది ఉండదు. ఇప్పటికీ నా ప్రాధాన్యత టెలివిజన్ కే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments