2000 Notes:రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం.. రూ.2 వేల నోటు ఉపసంహరణ , మార్చుకోవడానికి గడువు

  • IndiaGlitz, [Friday,May 19 2023]

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ.2 వేల నోటును వినియోగదారులకు అందుబాటులో వుంచొద్దని స్పష్టం చేసింది. రూ.2 వేల నోట్లు వున్న వారు సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. దేశంలోని19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఒక్కొక్కరు ఒక విడతల రూ.2 వేల నోట్లు పది మాత్రమే మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగనే రూ. 2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

రూ.2 వేల నోటును రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు :

పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబర్ 10 , 2016 నుంచి మనదేశంలో రూ.2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. గతకొంతకాలంగా బ్యాంకులు, ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు అందుబాటులో లేవు. ప్రస్తుతం దేశంలో 3.52 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చెలామణిలో వున్నట్లుగా సమాచారం. అయితే రూ.2 వేల నోటును రద్దు చేస్తారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు వాటిని ఖండించింది. పలువురు ఆర్ధిక వేత్తలు, ప్రముఖులు కూడా రూ.2000 నోటును రద్దు చేయాలని కోరారు కూడా. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

More News

Rashmika Mandanna:శ్రీవల్లి క్యారెక్టర్‌పై ఐశ్వర్య రాజేశ్ వ్యాఖ్యలు.. మీ మాటల్లో దురుద్దేశం లేదు, వివరణ ఎందుకు : వివాదానికి చెక్ పెట్టిన రష్మిక

అచ్చ తెలుగమ్మాయి.. ఐశ్వర్య రాజేశ్ తన మాతృభాషలో కాకుండా తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు.

Exclusive : బాలయ్యను కలవబోతున్నా.. రీ ఎంట్రీ పక్కా, త్వరలోనే హైదరాబాద్‌కి : సింహాద్రి హీరోయిన్ అంకిత

అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘‘సింహాద్రి’’.

Rajinikanth-Kapil Dev:దిగ్గజాలు కలిసిన వేళ : సింగిల్ ఫ్రేమ్‌లో కపిల్ దేవ్, రజనీకాంత్.. రెండు కళ్లు చాలడం లేదుగా

కపిల్ దేవ్, రజనీకాంత్.. వీరిద్దరి గురించి తెలియని భారతీయుడు వుండడు.

Sundeep Kishan:150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న‌ వ్య‌వ‌స్థ సిరీస్‌ను  ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌:  సందీప్ కిష‌న్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5.

LV Gangadhara Sastry:భగవద్గీతకే జీవితం అంకితం ..17 ఏళ్ల కృషికి గుర్తింపు : ఎల్‌వీ గంగాధర శాస్త్రికి గౌరవ డాక్టరేట్

ప్రసిద్ధ గాయకులు, గీతాగాన, ప్రవచన ప్రచారకర్త ఎల్‌వీ గంగాధర శాస్త్రికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో వున్న "మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం"